అక్షయ్‌ను తీసుకుని ఇర్ఫాన్‌ను తిరిగి పంపించు!.. అలా జరిగితే మొదట నువ్వే ఉండవ్.. మండిపడ్డ డైరెక్టర్

ఓ పక్క దిగ్గజ నటులు చనిపోయారు. మరోపక్క ఇండస్ట్రీ మొత్తం మూగబోయింది. సెలెబ్రిటీలందరూ సోషల్ మీడియాలో సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇలాంటి సమయాల్లోనూ వారి వక్రబుద్దిని బయట పెడుతున్నారు. చనిపోయిన ఇర్ఫాన్ ఖాన్‌ను తిరిగి ఇవ్వమని, అందుకు బదులుగా అక్షయ్ కుమార్‌ను తీసుకెళ్లమని ఓ నెటిజన్ ట్వీట్ చేసింది. ఇక ఈ ట్వీట్‌కు రెస్పాన్స్ కూడా భారీగానే వచ్చింది. ఈ ట్వీట్ కాస్తా.. దర్శకుడు హరీష్ శంకర్ వద్దకు చేరడంతో ఆయన గట్టిగా కౌంటర్ వేశాడు.

ఇర్ఫాన్ మృతి..

ఇర్ఫాన్ మృతి..

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నిన్న (ఏప్రిల్ 29) మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోషల్ మీడియాలో సెలెబ్రిటీలతో పాటు ఎంతో మంది అభిమానులు ఆయన మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ చిత్రమైన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

అక్షయ్‌ను తీసుకుని ఇర్ఫాన్‌ను ఇవ్వు..

అక్షయ్‌ను తీసుకుని ఇర్ఫాన్‌ను ఇవ్వు..

ఇర్ఫాన్ మృతి పట్ల అందరూ బాధ పడుతుండగా ఇలాంటి ట్వీట్స్ విద్వేషాలను కలిగిస్తాయి. అక్షయ్ కుమార్‌ను తీసుకుని ఇర్ఫాన్ ఖాన్ తిరిగి పంపించండని ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

మోదీకి సపోర్ట్ చేస్తున్నారనే కదా..

అక్షయ్ కుమార్‌ను తీసుకుని ఇర్ఫాన్ ఖాన్ తిరిగి పంపించండని చేసిన ట్వీట్‌కు ఓ నెటిజన్ స్పందిస్తూ.. మీకు అంతగా ద్వేషం కలిగేలా అక్షయ్ ఏం చేశారు..మోడికి మద్దతు చేయడం తప్పా.. ఆయన కష్టపడతారు, ఏడాదికి నాలుగు సినిమాలు చేసుకుంటారు.. ఆయన బతుకేదో ఆయన బతుకుతున్నారు. ఆయన తన కష్టంతోనే డబ్బులు సంపాదించుకుంటున్నారు. అయినా సరే ఈ జనాలెందుకు ఆయన్ను అంతగా ద్వేషిస్తారని ట్వీట్ చేశాడు.

Recommended Video

#BeTheRealMan : Megastar Chiranjeevi Accepts Young Tiger NTR Challenges
ట్వీట్‌పై స్పందించిన హరీష్ శంకర్..

ట్వీట్‌పై స్పందించిన హరీష్ శంకర్..

డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ ట్వీట్స్‌పై స్పందిస్తూ.. అక్షయ్ కుమార్‌ను తీసుకుని ఇర్ఫాన్ ఖాన్ తిరిగి పంపించండని అంటున్నారు.. అది అంత సులభమా? ఒకవేళ అదే జరిగితే అలాంటి మైండ్ సెట్ ఉన్నందుకు ఎంతో మంది ఆమెను తీసుకెళ్లమని అనేవారు.. మొదటగా ఆమె ఇక్కడ ఉండేది కాదని కౌంటర్ వేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X