పవన్,ఎన్టీఆర్ లు మొదట నో... : హరీష్ శంకర్
హరీష్ శంకర్ మాట్లాడుతూ... పవన్ కల్యాణ్‌కి మిరపకాయ్ కథ చెప్పాను. ఆయనకు నచ్చినా కొన్నికారణాల వల్ల చేయలేకపోయారు. అప్పట్లో ఎన్టీఆర్‌కి ఓ కథ చెప్పాను. కానీ కొన్ని కారణాలవల్ల ఆ సినిమా చేయలేకపోయాను.
ఇప్పుడు ఎన్టీఆర్... 'రామయ్యా వస్తావయ్యా' చేసే అవకాశమిచ్చారు. ఎన్టీఆర్ అభిమానులు తన నుంచి ఏమేం కోరుకుంటారో అవన్నీ ఇందులో ఉంటాయి. అలా కొందరు హీరోలతో కథలు ఓకే అయి సినిమాలు చేయలేకపోయాను. అయితే, అవన్నీ నాలో కసిని ఇంకా పెంచాయి అన్నారు హరీష్.
రవితేజ తనకు లైఫ్ ఇచ్చాడని చెప్తూ... షాక్ సినిమాతో దర్శకుడిగా నాకు జన్మనిచ్చాడు రవితేజ. అలాంటి రవితేజ మళ్లీ నాకు పునర్జన్మనిచ్చాడు. మిరపకాయ్ కథ చెబితే... వెంటనే ఒప్పుకున్నాడు. సినిమా హిట్టయ్యింది. నాకు పునర్జన్మ వచ్చినట్టయింది.
తర్వాత పవన్ కల్యాణ్... 'గబ్బర్‌సింగ్' అవకాశమిచ్చారు. ఆ సినిమాకి ఎంతో కష్టపడ్డాను. ఆ కష్టం వృథా పోలేదు. బ్లాక్‌బస్టర్ హిట్టయ్యింది. రెట్టించిన ఉత్సాహాన్నిచ్చింది. నేను అనుకున్నది ఎప్పటికైనా సాధిస్తానన్న సంకల్పబలమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఇది నా అతివిశ్వాసం కాదు... ఆత్మవిశ్వాసం అన్నారు హరీష్ శంకర్.


Click it and Unblock the Notifications












