twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పైసా ఇవ్వలేదు.. పేరు కూడా వేయలేదు.. ఏడ్చుకుంటూ వచ్చేశా: హరీష్ శంకర్

    |

    Recommended Video

    Valmiki Title Change || Valmiki Is Now Gaddalakonda Ganesh

    సినిమా కష్టాలు.. సినిమా కష్టాలు అంటుంటారు. అయితే అవి నిజంగా ఎలా ఉంటాయనేది వాటిని అనుభవించిన కొందరు చెబితే గానీ తెలియదు. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా వాటికి అతీతుడు కాదు. ఆయన కెరీర్ ఆరంభంలో చాలా కష్టాలు పడ్డారట. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆ సంఘటనల గురించి చెప్పారు హరీష్. వివరాల్లోకి పోతే..

    కెరీర్ తొలినాళ్లలోనే ఎన్నో బాధలు

    కెరీర్ తొలినాళ్లలోనే ఎన్నో బాధలు

    డైరెక్టర్ హరీష్ శంకర్ తన కెరీర్ తొలినాళ్లలోనే ఎన్నో బాధలు ఎదుర్కొన్నారట. సినిమా అంటే ఇష్టంగా ఇండస్ట్రీకి వచ్చిన ఆయనకు కొన్ని ఊహించని సంఘటనలు ఎదురయ్యాయట. గద్దలకొండ గణేష్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నకి ఎదురైన బాధాకరమైన ఒక సంఘటనను తెలిపాడు హరీష్.

    స్క్రిప్ట్‌పై కసరత్తులు.. చివరకు నిరాశ

    స్క్రిప్ట్‌పై కసరత్తులు.. చివరకు నిరాశ

    చిన్నతనం నుంచే తనకు సినిమాలంటే ఇష్టమని, దర్శకుడిని కావాలని కావాలని కళలు కంటుంది వాడినని హరీష్ శంకర్ చెప్పాడు. ఆ కారణం గానే ఒక దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా దాదాపు రెండేళ్లు పనిచేశానని, ఆ సినిమా కథా చర్చల్లో పాల్గొంటూ స్క్రిప్ట్ పై తీవ్రంగా కసరత్తులు చేయగా చివరకు తనకు నిరాశే ఎదురైందని ఆయన పేర్కొన్నాడు.

    ఆనందంతో షూటింగ్ స్పాట్‌కి వెళ్లగా..

    ఆనందంతో షూటింగ్ స్పాట్‌కి వెళ్లగా..

    తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా తాను ఎంతో కష్టపడిన ఆ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలైందని, దీంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పత్రికల్లో తన పేరు చూసుకోబోతున్నాననే ఆనందంతో షూటింగ్ స్పాట్‌కి వెళ్లానని చెప్పాడు. ముహూర్తం రోజున సినిమాకి సంబంధించిన సాంకేతిక నిపుణుల పేర్లను మీడియాకి ఇస్తారని అయితే ఆ లిస్టులో తన పేరు లేకపోవడంతో షాక్ అయ్యానని అన్నాడు.

    ఏడ్చుకుంటూనే బయటికి వచ్చేశా

    ఏడ్చుకుంటూనే బయటికి వచ్చేశా

    దీంతో వెంటనే ఆ సినిమా దర్శకుడిని ఇదేంటని అడిగితే ఏదో సమాధానం చెప్పి దాటేశాడని హరీష్ చెప్పాడు. ఆ సినిమా కోసం తాను పడిన రెండేళ్ల కష్టానికి రూపాయి కూడా రాకపోగా చివరకు తన పేరు కూడా వేయకపోవడం చూసి ఏడుపొచ్చేసిందని ఆయన అన్నాడు. దీంతో ఆ షూటింగ్ స్పాట్ నుంచి అలా ఏడ్చుకుంటూనే బయటికి వచ్చానని తన ఆవేదన వెళ్లగక్కాడు హరీష్.

    వాల్మీకి కాదు గద్దలకొండ గణేష్

    వాల్మీకి కాదు గద్దలకొండ గణేష్

    ఇక హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన తాజా సినిమా గద్దలకొండ గణేష్ గురించి చెప్పుకుంటే.. ఈ సినిమాకు ముందుగా వాల్మీకి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ తోనే ప్రమోషన్స్ కూడా జరిగాయి. కానీ కొన్ని వివాదాల కారణంగా తీరా విడుదలకు ముందు సినిమా పేరును గద్దలకొండ గణేష్‌గా మార్చేశారు.

    గద్దలకొండ గణేష్ మూవీ

    గద్దలకొండ గణేష్ మూవీ

    తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్‌గా రాబోతోంది గద్దలకొండ గణేష్ మూవీ. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా.. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 20 (ఈ రోజే) ఈ సినిమా విడుదల కానుంది.

    English summary
    Varun Tej' Valmiki movie title changed as Gaddalakonda Ganesh. In this movie promotions Harish Shankar says about his career first steps.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X