twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి సినిమా రాదు.. తీయలేరు.. అలాంటి దర్శకుడు మళ్లీ పుట్టరు.. హరీష్ శంకర్

    |

    జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మొట్ట మొదటి తెలుగు సినిమా 'శంకరాభరణం' విడుదలై 40 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా బాపురమణ అకాడమీ ఆధ్వర్యంలో ప్రసాద్‌ ల్యాబ్‌లో సోమవారం రాత్రి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాతపస్వి విశ్వనాథ్‌ గారు మాట్లాడుతూ.. 'ఫిబ్రవరి 1980లో శంకరాభరణం చిత్రం విడుదలైంది. నేను 'శంకరాభరణం' సినిమా ఇప్పుడు చూసినా కూడా 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టుగా ఉంది' అన్నారు.

    బండ్లు కట్టుకొని వచ్చి సినిమా చూశారు

    బండ్లు కట్టుకొని వచ్చి సినిమా చూశారు

    ఎల్బీ శ్రీరామ్‌ మాట్లాడుతూ.. ‘శంకరాభరణం సినిమాను నా యుక్త వయసులో చూశాను. హైదరాబాద్‌లో నాటకాలు ఆడే రోజుల్లో రిహార్సల్స్‌కు ఎగనామం పెట్టి సినిమా చూశాను. అప్పుడు థియేటర్లో ఎవరూ లేరు. ఆ తర్వాత బండ్లు కట్టుకొని సినిమాకు వచ్చారు. అలాంటి సినిమాని పాఠ్య గ్రంథంగా పెట్టి భవిష్యత్‌ దర్శకులకు ఎలాంటి సినిమాలు తీయాలో నేర్పాలి. సెల్‌‌ఫోన్‌లోనే సినిమాలు తీస్తున్న, చూస్తున్న ఈరోజుల్లో శంకరాభరణంని ఆదర్శంగా తీసుకుని అలాంటి చిత్రాను తీయాలి. శంకరాభరణ అనే సినిమాను మళ్లీ తీసే వాళ్లు లేరా? ఈ తరం దర్శకుల్లో అలాంటి వాళ్లు లేరా'అని సూచించారు.

    విశ్వనాథ్ లాంటి వాళ్లు మళ్లీ పుట్టరు

    విశ్వనాథ్ లాంటి వాళ్లు మళ్లీ పుట్టరు

    ఎల్పీ శ్రీరాం చేసిన కామెంట్లపై దర్శకుడు హరీష్‌ శంకర్‌ స్పందిస్తూ.. ‘మరో శంకరాభరణం, మరో సాగర సంగమంలాంటి చిత్రాలను ప్రస్తుత దర్శకుల నుంచి ఆశించకూడదు. ఎందుకంటే కె.విశ్వనాథ్‌ అనే వ్యక్తి ఒక్కరే వీటికి చిరునామా. అందువల్ల మళ్ళీ ఇలాంటి సినిమాలు వస్తాయని ఎదురుచూసి భంగపడొద్దు. మళ్ళీ ఇలాంటి సినిమాలు రావు, తీసేవారు లేరు. విశ్వనాథ్ లాంటి వాళ్లు మళ్లీ పుట్టరు' అన్నారు.

    100 ఏళ్ల బతకాలి

    100 ఏళ్ల బతకాలి

    అలనాటి హీరో చంద్రమోహన్‌ తన అనుభవాలను పంచుకుంటూ.. ‘మరో రెండు రోజుల్లో మా అన్నయ్య కె.విశ్వనాథ్‌ 90 ఏళ్ల వయసులోకి అడుగు పెడుతున్నారు. మా ఇద్దరి కాంబినేషన్‌‌లో మంచి హిట్‌ సినిమాలు వచ్చాయి. మా అన్నయ్య 100 పుట్టిన రోజులు జరుపుకోవాలి. శంకరాభరణం 50 ఏళ్ళ ఫంక్షన్‌ కి కూడా మా అన్నయ్య రావాలి' అని ఆకాంక్షించారు. బి.వి.ఎస్‌.రవి మాట్లాడుతూ.. ‘శంకరాభరణం లాంటి చిత్రాలు మళ్ళీ మళ్ళీ రావు.. ఇది తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రం. ఎన్ని తరాలు మారినా శంకరాభరణం తెలుగు సినిమా చరిత్రలో కలికితురాయిగా నిలుస్తుంది ' అన్నారు.

    అప్పట్లో 1 కోటి సంపాదించిన చిత్రం

    అప్పట్లో 1 కోటి సంపాదించిన చిత్రం

    సినీ విశ్లేషకుడు రెంటాల జయదేవ మాట్లాడుతూ ‘మొట్టమొదటి సారిగా తెలుగు సినిమాకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ‘శంకరాభరణం'. మళ్ళీ 39 ఏళ్ళకు బాహుబలి ద్వారా జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. అంతకుముందు వరకు ఈ సినిమానికి ఏదీ పోటీ లేదు. కమర్షియల్‌ గా కూడా ‘శంకరాభరణం' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఎన్టీఆర్‌ లాంటి పెద్ద పెద్ద హీరోలు లేకుండానే అప్పట్లో 1 కోటి రూపాయలు వసూలు చేసిన మంచి కమర్షియల్‌ విజయం సాధించిన సినిమా ఇది' అన్నారు.

    Recommended Video

    Darbar Pre Release Event : Harish Shankar's Request Makes Rajini Laugh !
     తెలుగు పరిశ్రమ చేసుకొన్న అదృష్టం

    తెలుగు పరిశ్రమ చేసుకొన్న అదృష్టం

    సీతారామశాస్త్రి మాట్లాడుతూ.. ‘శంకరాభరం లాంటి సినిమా తీయడం మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ చేసుకున్న అదృష్టం. కళాతపస్వి కె విశ్వనాథ్‌ మనకందించిన శంకరాభరణం చిత్రం చిరస్మరణీయం.' అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథ్‌ గారితో పాటు చంద్రమోహన్‌, డబ్బింగ్‌ జానకి, భీమేశ్వర్రావు, సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా చేసిన వంశీ, కస్తూరి, వీరితో పాటు ఏడిద నాగేశ్వర్రావు కుమారులు ఏడిద రాజా, ఏడిద శ్రీరామ్‌, అంతేగాకుండా సీతారామశాస్త్రి, ఎల్బీ శ్రీరామ్‌, హరీష్‌ శంకర్‌, కాశీ విశ్వనాథ్‌, బి.వి.ఎస్‌.రవి, దశరథ్‌, రచయిత ప్రవీణ్‌ వర్మ, తనికెళ్ళ భరణి, అశోక్‌ కుమార్‌, అనంత్‌, రమేష్‌ ప్రసాద్‌, అచ్చిరెడ్డి, మాధవపెద్ది సురేష్‌, డాక్టర్‌ కె. వెంకటేశ్వరరావు. తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Shankarabharanam movie completed 40 years, which is directed by and K Vishwanath. On occassion of this, a function organised in hyderabad. Director Harish Shankar made sensational speech in this event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X