ఆయనకు పెద్ద ఫ్యాన్‌ను.. అతనితో అట్లీ సినిమా తీయాలి.. హరీష్ శంకర్ కామెంట్స్ వైరల్
తమిళ సెన్సేషన్ అట్లీ.. ఇళయ దళపతి విజయ్‌తో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యాడు. గతంతో తేరీ, మెర్సెల్ అంటూ రికార్డులు కొల్లగొట్టిన అట్లీ.. ఈ సారి ప్రేక్షకులతో విజిల్ వేయించేందుకు రెడీ అయ్యాడు.
తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది చిత్రబృందం. దీపావళి కానుకగా రాబోతోన్న ఈ మూవీ.. నేడు హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గద్దలకొండ గణేష్ అంటూ సూపర్ హిట్ కొట్టిన హరీష్ మాట్లాడుతూ.. తాను అట్లీ, విజయ్ కాంబినేషన్‌కు పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు. అట్లీ సినిమాలన్నీ చూస్తూ ఉంటానని.. అతని వర్కింగ్ స్టైల్ నచ్చుతుందని అన్నారు. కింగ్ ఖాన్ షారుక్‌తో సినిమా చేస్తున్నట్లుగా విన్నానని.. నేను ఆయన అభిమానిగా కోరుకుంటున్నాను.. ఆయనతో అట్లీ సినిమా చేయాలని అనుకుంటున్నాను అంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు. గత కొన్ని రోజులుగా అట్లీ, షారుక్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందనే వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ తన స్పీచ్‌తో మరో సారి ఈ వార్తలకు బలం చేకూర్చాడు.


Click it and Unblock the Notifications











