twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంకా ఎంతకాలం మోసం.. ట్వీట్లతో కడిగిపారేసిన హరీష్ శంకర్

    By Rajababu
    |

    ఇంటర్నెట్ సర్వీస ప్రొవైడర్ల మోసాల గుట్టును దర్శకుడు హరీష్ శంకర్ రట్టు చేశాడు. యాక్ట్ ఫైడర్ నెట్ చేస్తున్న మోసాన్ని సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చాడు. దీంతో యాక్ట్ ఫైబర్ నెట్ మోసంపై నష్టపోతున్న కస్టమర్లు కూడా హరీష్‌కు మద్దతు తెలపడంతో ఈ వ్యవహారం రచ్చ రచ్చగా మారింది.

     ఎంతకాలం మోసం

    ఎంతకాలం మోసం

    డియర్ యాక్ట్‌ఫైబర్ నెట్.. మీ కస్టమర్ కేర్‌ సెంటర్‌తో పలు మార్లు మాట్లాడిన తర్వాత నేను ఈ ట్వీట్ చేస్తున్నాను. నేను 40ఎంబీపీఎస్‌కు డబ్బుల చెల్లిస్తే.. మీరు చెల్లించేది ఇదా అని స్పీడ్ టెస్ట్‌ను షేర్ చేశారు. నాకు తెలిసినంత కాలం ఇది మొదటిసారి కాదు. ఎంతకాలం మోసం చేస్తారో నాకు తెలియాలి.

     మీ సర్వీస్ మరీ చెండాలం

    మీ సర్వీస్ మరీ చెండాలం

    మీరు రెండుసార్లు స్పీడ్ టెస్ట్ చేశామని చెప్పారు. మీరు ఇండియాలో ఫాస్టెస్ట్ నెట్‌వర్క్ అని చెప్పుకొంటారు. వైజాగ్‌లో ఈ రోజు టెస్ట్ చేస్తే వచ్చిన స్పీడ్ ఇది. గత రెండు నెలలుగా మీ సర్వీస్ చాలా చెండాలంగా ఉంది.

    దారుణంగా మీ సేవలు

    దారుణంగా మీ సేవలు

    మీ నెట్ వర్క్ టీమ్‌కు రెండు వారాలుగా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాను. కానీ పరిస్థితిలో మార్పు లేకపోగా, మరింత దారుణంగా తయారైంది అని హరీష్ శంకర్ మరో ట్వీట్ చేశారు.

     10 మంది కాల్ చేశారు..

    10 మంది కాల్ చేశారు..

    ఇక ఈ వ్యవహారాన్ని పక్కన పెడితే.. మరో విషయంపై యాక్ట్ ఫైబర్ నెట్‌పై హరీష్ మండిపడ్డారు. నేను మీకు నా ఫోన్ నంబర్ షేర్ చేసిన తర్వాత 10 మందికిపైగా కాల్ చేశారు. మీ వద్ద నేను రిజిస్టర్ చేసుకొన్న మొబైల్ నంబర్‌తో నా ఇంటి అడ్రస్‌కు రాలేరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

     రోజంతా పని మానుకొని

    రోజంతా పని మానుకొని

    మీకు ఎన్నిసార్లు, ఎంత మందికి నా ఇంటి అడ్రస్ ఇవ్వాలి? రోజంతా నా పని చెడగొట్టుకొని మీ ఫోన్ కాల్స్‌కు స్పందించాలా అని ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా పలువురు యాక్ట్ ఫైబర్ నెట్‌వర్క్ చేస్తున్న మోసాలను ట్విట్టర్‌లో మొరపెట్టుకొన్నారు.

    English summary
    Direct Harish Shankar shocks Internet Service provider Fiber ACT net. Harish brought this companies cheating to day light thru Twitter. He fired the service provider for not making proper service via serial tweets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X