దర్శకుడు హరీష్ శంకర్...స్కైడైవింగ్ (ఫోటోస్)
లండన్ : 'గబ్బర్ సింగ్' చిత్రం భారీ విజయం సాధించడంతో దర్శకుడు హరీష్ శంకర్‌కి రెమ్యూనరేషన్ బాగానే ముట్టినట్టుంది. దీంతో ఈ డైరెక్టర్ విదేశీ పర్యనటలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా లండన్ లో పర్యటించిన హరీష్ శంకర్ ఎంతో సాహసంతో కూడిన స్కైడైవింగ్ చేసాడు. ఎంతో ఎగ్జైట్‌మెంట్ గా ఉందంటూ తన అనుభవాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.

స్కైడైవింగ్‌కు బయల్దేరుతున్న హరీష్ శంకర్

ప్లేన్ నుంచి దూకుతూ....

ఆకాశంలో విహరిస్తున్న హరీష్ శంకర్
గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత ఈ దర్శకుడు యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం ఓపెనింగ్ పూజా కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ కార్యాలయంలో జరిగింది. దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి టైటిల్, హీరోయిన్, ఇతర తారాగణం ఫైనల్ కావాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications











