పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" ఆగిపోయిందా? హరీష్ శంకర్ దిమ్మతిరిగే రిప్లై

టాలీవుడ్ అగ్ర హీరోస్ లో ఒకరైన పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ తన సినిమాలకి బాగా ఎక్కువ గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లోనే ఎక్కువ ఉంటున్న సంగతి తెలిసిందే. కాగా ఎన్నికల ముందే చాలా గ్యాప్ ఇచ్చి ఇప్పుడు గెలిచిన తర్వాత ఇంకా గ్యాప్ తీసుకోబోతున్నాను అని కూడా క్లారిటీ ఇచ్చారు. కాగా ఇటీవల తన భారీ చిత్రం 'ఓజి' విషయంలో చేసిన కామెంట్స్ కూడా బాగా వైరల్ గా మారాయి.

అయితే పవన్ తో సినిమాలు చేస్తే డెఫినెట్ గా సినిమా నిర్మాతలకి ఎక్కడో చిన్న టెన్షన్ ఉంటుంది అని ఎప్పుడు నుంచో ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్న మాట. అలా ఇప్పుడు వరకు చేసిన చాలా చిత్రాలు బాగా ఆలస్యం అవ్వడమో లేక అసలు సినిమాలు ఆగిపోవడమో చాలా జరిగాయి. కాగా ఇప్పుడు మరోసారి అదే తరహా పరిస్థితి పవన్ చేస్తున్న సినిమాల విషయంలో నెలకొంది.

harish shankar solid reply on ustaad bhagat singh shelved gossips

కాగా ఇప్పుడు పవన్ చేతిలో మూడు సినిమాలు ఉండగా అన్ని సినిమాలు కూడా ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు హోల్డ్ లో ఉన్నాయి. మరి ఆ చిత్రాలే దర్శకుడు సుజీత్ తో "ఓజి" దర్శకుడు జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడితో "హరిహర వీరమల్లు" ఇంకా దర్శకుడు హరీష్ శంకర్ తో "ఉస్తాద్ భగత్ సింగ్" లు అని చెప్పాలి.

కాగా క్రిష్, సుజీత్ లు సినిమా పాన్ ఇండియా చిత్రాలు స్ట్రైట్ సినిమాలు పక్కన పెడితే హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి మాత్రం వేరు అని చెప్పాలి. కాగా ఈ చిత్రాన్ని అసలు "భవదీయుడు భగత్ సింగ్" అని స్టార్ట్ చేసి పూజా హెగ్డే హీరోయిన్ గా అనుకోని తర్వాత మళ్ళీ దీన్ని ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ మార్చి హీరోయిన్ గా శ్రీలీల ని తీసుకున్నారు. ఇలా స్టార్టింగ్ నుంచే ఈ సినిమా చాలా నెగిటివ్ కామెంట్స్ తో స్టార్ట్ అయ్యింది.

ఇంతే కాకుండా ఈ సినిమా రీమేక్ అని టాక్ రావడంతో ఓ రేంజ్ లో నెగిటివ్ వాతావరణం మొదలైంది. మరోసారి హరీష్ శంకర్ పవన్ ఫ్యాన్స్ తో విస్తు పోయాడు కానీ తన వర్క్ తో అందరికీ తాను సమాధానం అందించాడు. ఫస్ట్ గ్లింప్స్ తోనే అసలు ఇది రీమేక్ సినిమానా అనేలా పవన్ ని ఊహించని ఎనర్జీతో చూపించాడు.

harish shankar solid reply on ustaad bhagat singh shelved gossips

కాగా ఈ తర్వాత నుంచి చిత్రం అసలు ఆగిపోయింది అని అనేక రూమర్స్ వచ్చాయి. ఇక పవన్ నుంచి రీసెంట్ స్టేట్మెంట్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయింది అంటూ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. అయితే వీటిపై హరీష్ శంకర్ లేటెస్ట్ గా దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. సినిమా స్టార్ట్ అవ్వదు అన్నపుడే రూమర్స్ పట్టించుకోలేదు. ఇప్పుడు రూమర్స్ చదివే టైం కూడా లేదు అంటూ అసలు ఆ రూమర్స్ నే కొట్టి పారేసాడు.

దీనితో అసలు ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కాగా జస్ట్ పవన్ ఇచ్చే సమయం కోసం మేకర్స్ చూస్తున్నారు. ఇది సెట్ అయితే మళ్ళీ ఉస్తాద్ ఆన్ ట్రాక్ లో ఉంటుంది అని చెప్పవచ్చు. కాగా ఈ సినిమా కాకుండా హరీష్ అయితే మాస్ మహారాజ్ రవితేజతో "మిస్టర్ బచ్చన్" అనే సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ కి రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X