twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోల ఇగోలను క్యాష్ చేసుకుంటున్న హరీష్ శంకర్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : 'గబ్బర్ సింగ్' సినిమా భారీ విజయం సాధించడంతో స్టార్ దర్శకుడిగా మారిన హరీష్ శంకర్....హిట్ ఫార్ములా ఏమిటనేది బాగా తెలుసుకున్నట్లున్నాడు. అందుకే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి సరికొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు. అది మరేమిటో కాదు...హీరోల ఇగో(ego-అహం)లను రెచ్చగొట్టడమే.

    గబ్బర్ సింగ్ చిత్రాన్నే ఉదాహరణకు తీసుకుంటే....పవన్ కళ్యాణ్‌కు కాస్త తిక్క అనే విషయం అంతకు ముందు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఆ తిక్కను తెరపై ఆవిష్కరించి దానికి సరికొత్త అర్థం చెప్పి ప్రేక్షకులు, అభిమానులతో సూపర్ అనిపించుకున్నాడు ఈ యువ దర్శకుడు.

    తాజాగా జూ ఎన్టీఆర్‌తో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న హరీష్ శంకర్ ఇక్కడ జూ ఎన్టీఆర్ ఇగోను రెచ్చగొట్టి సినిమాను హిట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ బాగా పాపులర్ అయిన నేపథ్యంలో ఆయన పేరుతో తెరంగ్రేటం చేసిన జూనియర్ ఎన్టీఆర్‌ను చాలా చోట్ల బుడ్డోడు అని పిలుస్తుంటారు.

    ఈ నేపథ్యంలో....'బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా....అలా అనాలంటే ఓ అర్హత ఉండాలి లేదా అభిమాని అయి ఉండాలి' అనే డైలాగుతో ట్రైలర్ వదిలి ఒక్కసారిగా సినిమాపై హైప్ పెంచాడు హరీష్ శంకర్. మరి హీరోల ఇగోలతో సక్సెస్ గేమ్ ఆడుతున్న హరీష్ శంకర్ మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుందో...?

    English summary
    Director Harish Shankar play Success game with egos of heroes. He knows how to draw the audience to the theatres and particularly knows how to cash on egos of heroes.He did it with Pawan Kalyan's blockbuster film 'Gabbar Singh'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X