పవన్-పూరి కాంబోపై.. హరీష్ శంకర్ కామెంట్స్
పవన్ కళ్యాణ్‌తో త్వరలోనే సినిమా చేయబోతున్నాను అంటూ పూరి జగన్నాధ్ ప్రకటించిన విషయం తెలిసిందే. పూరి ట్విట్టర్లో ఈ ప్రటకన చేశారో లేదు...అటు పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచే కాకుండా ఇటు పలువురు సినీ ప్రముఖ నుంచి కూడా ఆనందం వ్యక్తం అవుతోంది.
పవన్-పూరి సినిమాపై 'గబ్బర్ సింగ్' దర్శకుడు హరీష్ శంకర్ స్పందిస్తూ....''ఈ విషయం వినగానే సూపర్ థ్రిల్లింగ్ గా ఫీలయ్యాను. నా అభిమాన హీరో పవన్ కళ్యాణ్, మా గురూజీ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా రికార్డు స్థాయి హిట్టవుతుందని భావిస్తున్నాను'' అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.
హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా 'గబ్బర్ సింగ్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో వచ్చిన దబాంగ్ చిత్రానికి ఇది రీమేక్. పరమేశ్వరి ఆర్ట్స్ష్ బ్యానర్ పై నిర్మాత గణేష్ బాబు గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











