twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి వారిని వదిలి పెట్టొద్దు.. హరీష్ శంకర్ కామెంట్స్

    |

    కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలన్నీ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాయి. ఈ వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికాయే కుదేలైపోతోంది. అలాంటి వైరస్.. భారతదేశంలోనూ తన ప్రభావాన్ని చూపుతోంది. రోజురోజుకూ కరోనా కేసుల కుప్పులుతెప్పలుగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే నాలుగు వేల మందికిపైగా కరోనా సోకింది. వందకుపైగా ప్రాణాలను కోల్పోయారు.

    ఇంతలా విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నాయి. 21 రోజుల లాక్ డౌన్‌ను విధించడంతో ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. దీంతో కరోనాను కాస్త కట్టడి చేయగలిగారు కానీ పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకోలేకపోతున్నారు. అయితే కరోనా సంగతి పక్కన బెడితే.. వాటిపై వస్తున్న ఫేక్ న్యూస్‌ పెద్ద తలనొప్పిగా మారుతోంది. వీటిపై స్వయానా ముఖ్యమంత్రి కూడా మాట్లాడేవరకు వచ్చిందంటే..పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

    Harish Shankar Tweet About Fake News On Corona

    కేసీఆర్ మాట్లాడుతూ.. తప్పుడు వార్తలు రాసేవారికి కరోనా రావాలని, అప్పుడు వారికి కూడా బాధ అర్థమవుతుందని ఫైర్ అయ్యాడు. తాజాగా ఈ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ హరీష్ శంకర్ ఓ ట్వీట్ చేశాడు. కొందరు కావాలనే అలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారు.. అలాంటి వాటిని రిపోర్ట్ చేసేందుకు ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేయండి.. అలాంటి వారిని ఊరికే వదలొద్దు.. అంటూ సిటీ కమీషనర్, పోలీస్ డిపార్ట్ మెంట్‌కు సూచించాడు.

    English summary
    Harish Shankar Tweet About Fake News On Corona. Few people r spreading provocative posts in social media it would be nice if hydcitypolice will provide a Twitter handle or an email to report such posts.... as per yesterday CM sir s speech this time is crucial and We shall not spare such people.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X