'గబ్బర్ సింగ్' ఫస్ట్ లుక్ కాదంటూ డైరక్టర్
గబ్బర్ సింగ్ స్టిల్స్ ను మీడియాకు విడుదల చేసారు. వీటిని చూసిన అభిమానులు ఫస్ట్ లుక్ ఫోటోలంటూ ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. పోలీస్ డ్రస్ లో పవన్ కళ్యాణ్ ఓ రేంజిలో అదరకొడుతున్నాడు. అయితే వీటిని ఫస్ట్ లుక్ గా పరిగణించవద్దని దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్ చేసారు. అవి కేవలం ప్రెస్ కి విడుదల చేసిన స్టిల్స్ మాత్రమేనని అన్నారు. అస్సలు సర్పైజ్ అంతా రేపు ఉంటుందని అన్నారు. ఇప్పుడు విడుదల చేసి స్టిల్స్ కేవలం న్యూ ఇయిర్ విషెష్ కి మాత్రమే అన్నారు. ఇక దబాంగ్ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ ఓ వెరైటి రోల్ లో కనిపిస్తారు. పంచ్ డైలాగులు చెప్తూ పోలీసుగా అందరి మనస్సులు దోచుకుంటాడని అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ లో ని ఓ డైలాగు లీక్ అంటూ నెట్ లో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే... "లైఫ్ లో రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి నాతో మాట్లాడేటప్పుడు...రెండోది నాతో పోట్లాడేటప్పుడు..
ఈ చిత్రం పై నిర్మాత బండ్ల గణేష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు..ఆయన చెపుతూ..''పవన్ కల్యాణ్ అభిమానులకే కాదు.. అన్ని వర్గాలకూ నచ్చేలా సినిమాను తీర్చిదిద్దుతున్నాం. వినోదం, యాక్షన్ అన్నీ సమపాళ్లలో ఉంటాయ''అన్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తోంది. బాలీవుడ్‌లో విజయవంతమైన 'దబాంగ్' చిత్రాన్ని ఆధారంగా తీసుకొన్నా... పవన్‌కి అనుగుణంగా స్క్రిప్టులో చాలా మార్పులు చేశారని యూనిట్ వర్గాలు చెప్తున్నారు. అలాగే 'పంజా'లో స్త్టెలిష్‌గా కనిపించిన పవన్ కల్యాణ్ ఈసారి తన పాత శైలిలోకి వెళ్లిపోయి అలరిస్తారని చెప్పుకుంటున్నారు. సినిమా చాలా వినోదాత్మకంగా సాగుతుందని,హిందీ కన్నా పెద్ద హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. . యాభై రోజుల షెడ్యూల్ లో మాగ్జిమం టాకీ పార్ట్ అవకొట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ నటిని ఒప్పించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ రెండు పాటల రికార్టింగ్ పూర్తి చేసారు. ఇక దబాంగ్ రీమేక్ గా రూపొందుతోన్న గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మాత గణేష్ బాబు..ఎట్టి పరిస్దితుల్లోనూ అనుకున్న తేదీకే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్, సుహాసిని, అభిమన్యు సింగ్, నాగినీడు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 28 వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











