»   » జూ ఎన్టీఆర్ ‘రామయ్యా...’ రిలీజ్‌పై హరీష్ ట్వీట్

జూ ఎన్టీఆర్ ‘రామయ్యా...’ రిలీజ్‌పై హరీష్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్-హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం విడుదల తేదీని మరోసారి స్పష్టం చేసారు దర్శకుడు హరీష్ శంకర్. ఈచిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 27న విడుదల చేసి తీరుతామని ట్వీట్ చేసారు. ఆగస్టు నెలలో ఆడియో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు.

బాద్‌షా తర్వాత ఎన్టీఆర్‌, గబ్బర్‌సింగ్‌ తర్వాత హరీశ్‌ శంకర్‌ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. టైటిల్‌కు అన్ని వర్గాల నుంచీ మంచి స్పందన వచ్చిందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పంచ్‌ డైలాగ్స్‌, ఆయన ఎమోషనల్‌ కేరక్టర్‌ హైలైట్‌గా నిలుస్తాయని హరీశ్‌ శంకర్‌ చెప్పారు.

ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

English summary
“As Rumours are spreading and confusing alot, I wanna clarify RV audio release in aug and movie on September 27th; AT ANY COST” , Harish Shankar tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu