మక్కెలిరగదీస్తున్న జూ ఎన్టీఆర్, హరీష్ ట్వీట్
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ పార్ట్ చిత్రీకరణ జరుగుతోంది. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఫైట్ సీన్లు చిత్రీకరిస్తున్నారు.
రామ్-లక్ష్మణ్ వర్క్‌పై దర్శకుడు హరీష్ శంకర్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ....ఆ విశేషాలను తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'మళ్లీ రామ్-లక్ష్మణ్ మాస్టర్స్‌తో పని చేయడం హాపీగా ఉంది. వీరు 'రామయ్య..'ను ఎంతో ఎనర్జిటిక్ చూపించబోతున్నారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ లేకుండా మిరపకాయ్, గబ్బర్ సింగ్ లాంటి చిత్రాల్లోని యాక్షన్ పార్టును ఊహించుకోవడం కష్టమే. మా మధ్య మంచి అండర్ స్టాండిగ్ ఉంది. వారు దర్శకుల అభిరుచికి తగిన విధంగా పని చేసే మాస్టర్స్' అంటూ ట్వీట్ చేసాడు.
'రామయ్యా వస్తావయ్యా' చిత్రానికి సంబంధించిన ఇంట్రడక్షన్ సాంగ్ ఇటీవలే మలేషియాలో చిత్రీకరించారు. దీంతో ఇప్పుడు యాక్షన్ పార్టు చిత్రీకరణ మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఎన్టీఆర్ నుంచి వినోదం, యాక్షన్ కలగలిపిన హిట్ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది యూనిట్ సభ్యుల్లో...
హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాత శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంత మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రుతిహాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


Click it and Unblock the Notifications











