సహనంగా ఉండమంటూ హరీష్ శంకర్ రిక్వెస్ట్
హరీష్ శంకర్ ట్వీట్ చేస్తూ..." మేము ఆడియో, సినిమా రిలీజ్ గురించి ప్రకటించే దాకా ఫ్యాన్స్ అందరిని సహనంగా ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాను...నన్ను నమ్మండి మీకు కన్నుల పండగగా విందు చేస్తాను" అన్నారు.
గతంలో హరీష్ శంకర్ ఇదే విషయమై ట్వీట్ చేస్తూ ..."ఈ సినిమా గురించి వస్తున్న రూమర్లను దృష్టిలో పెట్టుకుని గందరగోళాన్ని నివారించడానికి ఈ వివరణ ఇస్తున్నాను. సినిమాను ఇంతకు ముందు చెప్పినట్టు సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తాం. ఇందులో ఏ మార్పూ లేదు. ఏది ఏమైనా ఇది జరిగితీరుతుంది" అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో రోజు రోజుకూ మారుతున్న పరిస్దితుల దృష్ట్యా ఇలా వివరణ ఇస్తూ ట్వీట్ చేసారు.
ఇక 'రామయ్యా వస్తావయ్యా' సినిమా కోసం హంసా నందిని పై ఓ స్పెషల్ సాంగ్ ని త్వరలోనే షూట్ చేయనున్నారు. ప్రభాస్ 'మిర్చి' ఐటం సాంగ్ చేసిన ఈ భామ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. 'రామయ్యా వస్తావయ్యా' సినిమా కోసం ఎన్.టి.ఆర్ తో స్టెప్పు లేయడానికి సిద్దమవటంతో ఫ్యాన్స్ లో ఆనందం కలుగుతోంది.
దిల్ రాజు మాట్లాడుతూ- ''ఎన్టీఆర్ ఇమేజ్‌ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టే సినిమా అవుతుంది. తన గత చిత్రాలకు ధీటుగా హరీష్‌శంకర్ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇటీవలే మైసూర్‌లో ఎన్టీఆర్, సమంత, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను, రెండు పాటలను చిత్రీకరించాం. అంచనాలను మించేలా ఉంటుందీ సినిమా'' అని చెప్పారు. అలాగే... ''బృందావనంలో ఎన్టీఆర్‌ని సరికొత్తగా చూపించాం. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ని వైవిధ్యభరితమైన పాత్రలో ఆవిష్కరించబోతున్నాం. ఆయన అభిమానులు ఏం కోరుకొంటున్నారో అవన్నీ ఈ కథలో మేళవించాం. ఎన్టీఆర్, సమంతలపై తెరకెక్కించిన సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి''అన్నారు.


Click it and Unblock the Notifications












