అడిగిన వారందరికీ ఇదే సమాధానం.. హరీష్ శంకర్ ట్వీట్

కరోనా లాంటి భయంకరమైన వైరస్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా నుంచి మొదలు కొని ప్రపంచలోని ప్రతీ దేశం ఈ వైరస్ బారిన పడింది. విరుగుడు లేని ఈ వైరస్ కారణంగా వేల మంది ప్రాణాలను కోల్పోయారు. మన దేశంలోనూ కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దాదాపు ఏడు వేలమందికి కరోనా సోకగా.. రెండు వందల మందికిపైగా ప్రాణాలను కోల్పోయారు.

ఇంతలా భయపెడుతున్న కరోనాను కట్డడి చేసేందుకు మన ప్రభుత్వాలు కఠిన చర్యలను తీసుకుంటున్నాయి. కరోనాను అదుపులో ఉంచేందుకు 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. ఈ మేరకు ఏప్రిల్ 14 వరకు ప్రజలంతా ఇంటి పట్టునే ఉండాలని ప్రభుత్వాలు సూచించాయి. ఈ నిర్ణయంతో ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. మరెంతో మంది నిరాశ్రయులు అయ్యారు. వీరిని కాపాడటానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.

 Harish Shankar Tweet About Voluntary To Help Government In Covid 19 Epidemic

ప్రభుత్వాలకు ఇలాంటి కష్టకాలంలో సాయం చేసేందుకు ఎంతో మంది ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. ఇదే విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు. ప్రభుత్వానికి సాయం చేసేందుకు వాలంటీర్‌గా పని చేస్తామనని తనను అడుగుతున్నారని, వారిని ఎలా గైడ్ చేయాలని కేటీఆర్‌ను సలహా అడిగాడు. ఈ మేరకు కేటీఆర్ స్పందిస్తూ.. సరైన సమయంలో ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని తెలిపాడు. ఇదే విషయాన్ని హరీష్ శంకర్ చెబుతూ.. తనను సలహా అడిగిన వారందరూ గమనించగలరని ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X