చిరంజీవిని చూపిస్తూ ఈర్ష్యగా ఉందనేసిన హరీష్ శంకర్.. సెన్సేషనల్ కామెంట్
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినీ సెలెబ్రిటీలు తమ భావాలను తెలపడానికి ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. హీరో హీరోయిన్లు మొదలుకొని డైరెక్టర్ల వరకు అందరూ నెట్టింట యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఫోటో పోస్ట్ చేస్తూ డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన ట్వీట్ సెన్సేషన్ అవుతోంది. ఇంతకీ హరీష్ ఏమన్నాడు. వివరాల్లోకి పోతే..
మెగాస్టార్ చిరంజీవి ఫొటో షేర్ చేస్తూ
ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఫొటో షేర్ చేసిన హరీష్ శంకర్.. ''ఈ పిక్‌ని పోస్ట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. మొదటిసారి నా స్నేహితుడు కొరటాల శివపై ఈర్ష్యగా ఉంది. వీరు ఎలాంటి సినిమా చేయబోతున్నారో అని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది'' అని పోస్ట్ చేశాడు.

స్లిమ్ లుక్‌లో చిరంజీవి.. అందుకే హరీష్ జలసీ
హరీష్ షేర్ చేసిన ఈ పిక్‌లో మెగాస్టార్ చిరంజీవి స్లిమ్ లుక్ లో కనిపించాడు. గత 30 ఏళ్ల క్రిందటి చిరంజీవి లుక్ మళ్ళీ కనిపిస్తున్నట్లుగా ఉంది. అయితే చిరు ఈ లుక్ లోకి రావడానికి కారణం డైరెక్టర్ కొరటాల శివ. చిరు- కొరటాల కాంబోలో రాబోతున్న కొత్త సినిమా కోసం చిరు ఈ సూపర్బ్ లుక్‌లోకి మారారు. అందుకేనేమో కొరటాలపై హరీష్ జలసీగా ఉందని పేర్కొంది.
నెటిజన్ల స్పందన.. మెగాస్టార్ పై అభిమానం
బేసికల్‌గా హరీష్ శంకర్‌కి మెగాస్టార్ చిరంజీవి అంటే అమితమైన అభిమానం. గతంలో ఆయన రూపొందించి ఓ సినిమా ఈవెంట్ లో పాల్గొన్న చిరంజీవి, హరీష్ శంకర్ తో సినిమా తీయాలనుందని పేర్కొనడం.. ఆ టైమ్ లో చిరు పాదాలకు హరీష్ నమస్కారం చేయడం లాంటివి జరిగాయి. తాజాగా ఆ వీడియోను కూడా పోస్ట్ చేస్తూ మరోసారి తన అభిమానం చాటుకున్నాడు హరీష్ శంకర్.

చిరంజీవి- కొరటాల మూవీ
ఇక చిరంజీవి- కొరటాల శివ కాంబోలో రాబోతున్న సినిమా విషయానికొస్తే.. ఇటీవలే ఈ సినిమా అఫీషియల్‌గా ప్రకటించబడింది. మెగాస్టార్ పుట్టిన రోజున ఈ సినిమా ప్రారంభించబడి, సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. ఈ సినిమాలో హాకీ కోచ్‌గా చిరు నటించనున్నాడని తెలుస్తోంది.
ఈ సినిమాలో నయనతారను హీరోయిన్ గా ఫైనల్ చేశారని టాక్.


Click it and Unblock the Notifications











