»   » పవన్ ఫ్యాన్ ట్వీట్...చిర్రెత్తిపోయిన హరీష్ శంకర్!

పవన్ ఫ్యాన్ ట్వీట్...చిర్రెత్తిపోయిన హరీష్ శంకర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Harish Shankar
హైదరాబాద్: 'గబ్బర్ సింగ్' సినిమా భారీ విజయం సాధించడంతో మామూలు దర్శకుడి స్థాయి నుంచి రాత్రికి రాత్రే స్టార్ దర్శకుడి స్థాయికి ఎదిగిన హరీష్ శంకర్....ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్‌కు కాలేజీ రోజుల నుంచే నేను వీరాభిమానిని అని చెప్పుకోవడంతో పవన్ ఫ్యాన్స్ కూడా ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సోషల్ నెట్వర్కింగులో విరివిగా ఫాలో కావడం మొదలు పెట్టారు. పవన్‌ను హరీష్ పొగుడుతుంటే ఫ్యాన్స్ సంబర పడిపోయారు.

అయితే 'గబ్బర్ సింగ్' ఆ సినిమా పూర్తయి జూ ఎన్టీఆర్‌తో 'రామయ్యా వస్తావయ్యా' మొదలు పెట్టగానే హరీష్ శంకర్ పవన్ భజన మానేసి.....జూ ఎన్టీఆర్ భజన మొదలు పెట్టారు. అప్పుడు గానీ అర్థంకాలేదు! హరీష్ శంకర్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే భజన పార్టీ అని. హరీష్ శంకర్ ట్విట్టర్ పేజీలో అతిగా చేసే ట్వీట్లు చూసి పలువురు చిరాకు పడ్డ సందర్భాలూ ఉన్నాయి.

భారీ అంచనాలతో ఇటీవల విడుదలైన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం ఫస్టాఫ్ ఓకే కానీ...సెకండాఫ్ బాగోలేదనే టాక్ స్ర్పెడ్ అవడంతో సినిమా కాస్త డీలా పడింది. దీంతో ఓ పవన్ అభిమాని......'మీరు అతిగా ట్వీట్లు చేసి సినిమాపై అంచనాలు భారీగా పెంచారు. మీరు ట్వీట్స్ పై పెట్టిన శ్రద్ధ కాస్త సెకండాఫ్‌లో పెట్టి ఉంటే సినిమా బాగుండేది' అంటూ ఎటకారంగా వ్యాఖ్యానించారు.

సదరు అభిమాని ట్వీట్‌తో హరీష్ శంకర్ అహం దెబ్బతిన్నట్లయింది. దీంతో ఆయన కాస్త కోపంగా స్పందించారు. 'నువ్వు కూడా నా మీద పెట్టే శ్రద్ధలో సగం నీ మీద పెడితే లైఫ్ ఇంకా బాగుంటుంది ఆల్ ది బెస్ట్' అంటూ రిప్లై ఇచ్చారు. హరీష్ శంకర్ ఇలా రిప్లై ఇవ్వడంపై ఇండస్ట్రీలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

English summary
"meeru tweets pina pettina shredha kastha second half lo petti unte cinema bagundedi" pawan fan tweeted to director Harish shankar. And Harish replied "Nuvvu Kooda naa meedha pette shraddha lo Sagam nee meedha pedithe nee life inkaa Baaguntundhi all the best"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu