ఛార్మితో రూమర్ పై హరీష్ శంకర్ ట్వీట్

By Srikanya

హైదరాబాద్ : హరీష్ శంకర్ ని ఛార్మి లెంపకాయ కొట్టిందంటూ గత కొద్ది రోజులుగా ఓ వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన అభిమానులు..ట్విట్టర్ లో ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై ఆయన స్పందిస్తూ... దేముడు దయవల్ల...నాకు రూమర్స్ స్పందించటానికి,రికాక్టు అవటానికి సమయం లేదు..నేను ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో హై ఓల్టేజ్ ఎనర్జిటిక్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నాను...అంటూ శ్రీశ్రీ పాపులర్ కోట్ నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిన్యంగా న్యంగా వీరె....నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే.. నిబిడాశ్చర్యంతో వీరు!! ని కోట్ చేసారు.

ఇంతకీ గ్యాసిప్ లాంటి ఆ వార్త ఏమిటంటే...ఇటీవల ఈ దర్శకుడిని కలిసేందుకు చార్మి వెళ్లిందని.... అయితే అతను ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో తిక్క రేగిన చార్మి అతని చెంపపై కొట్టిందని అంటున్నారు. సదరు దర్శకుడు నిషాలో ఉండటం వల్లనే అలా ప్రవర్తించాడని, అతని ప్రవర్తన చెడుగా ఉండటం వల్లనే చార్మి అలా చేసినట్లు స్ప్రెడ్ అవుతోంది. అయితే హరీష్ శంకర్ ప్రవర్తన చాలా పద్దతిగా ఉంటుందని, ఇది రూమరే అని ...అతనితో పరిచయం ఉన్న వారు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం హరీష్ శంకర్ ఎన్టీఆర్ చిత్రం విషయంలో బిజీగా ఉన్నారు. చిత్రం షూటింగ్ డిటైల్స్ ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియచేసారు...ఆయన ట్వీట్ లో ...యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ మా సినిమా షూటింగ్ ప్రారంభించడానికి డేట్స్ ఇచ్చారు. జనవరి 3 నుంచి 15 వరకు తొలి షెడ్యూల్ షూటింగ్ జరుగనుంది. మేము అంతా సిద్దంగా ఉన్నాం. ఎనర్జిటిక్ యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్‌తో కలిసి పని చేయడానికి మా టీం అంతా ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తోంది' అంటూ... హరీష్ శంకర్ తన ట్విట్టర్లో ప్రకటించారు. 'మై బ్రదర్ శ్రీను వైట్ల, నిర్మాత బండ్ల గణేష్‌లకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారి సినిమా (బాద్ షా) షెడ్యూల్స్ పూర్తికాక ముందే మా సినిమాకు యంగ్ టైగర్ డేట్స్ ఇచ్చేలా సహకరించినందుకు థాంక్స్' అని హరీష్ శంకర్ పేర్కొన్నారు.

ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటించనుంది. ఇతర తారాగణం ఫైనల్ కావాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X