‘ఎఫ్ 2’ వేడుకలో బిగ్ బాస్ హరితేజ ఫసక్... ఏం జరిగిందంటే?
విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించిన 'ఎఫ్ 2- ఫన్ అండ్ ఫ్రస్టేషన్' ఆడియో రిలీజ్ వేడుక విశాఖపట్నంలో జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలను ఆర్.కె.బీచ్‌లో జరిగిన విశాఖ ఉత్సవంలో విడుదల చేశారు. ఆడియో సీడీలను ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు విడుదల చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హరితే మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

యాంకర్ సుమ, హరితేజ
ఈ చిత్రంలో హరితేజ కీలకమైన పాత్రలో నటించారు. సినిమా గురించి మాట్లాడటానికి స్టేజీపైకి రాగానే ఆమెకు, యాంకర్ సుమకు మధ్య ఆసక్తికర డిస్ర్కషన్స్ జరిగింది. నేను మాట్లాడితే టెన్షన్లో ఏదేదో అనేస్తాను, అందుకే ఓ కవిత చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలోని డైనింగ్ టేబుల్ సీన్ నుంచి ఇన్‌స్పైర్ అయి రాసిన కవిత అంటూ హరితేజ తన ప్రసంగం ప్రారంభించింది.

హరితే చెప్పిన దేవుడా..దేవుడా కవిత ఇదే
‘దేవుడా దేవుడా... ఓ మంచి దేవుడా...సినిమా అనగానే డబ్బుకట్టలతో ముందుకొచ్చే మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ ఇచ్చావ్..
సినిమా అనగానే తన ప్రాణాన్నయినా పనంగా పెట్టి జనాల్ని తన ప్రాణం పోయేలా నవ్వించే అనిల్ రావిపూడినిచ్చావ్..
సినిమా అనగానే ఆటలతో పాటలతో వాళ్ల నటనతో మనల్ని అందంగా నవ్వించే వి2 వరణ్ తేజ్, వెంకటేష్ గారిని ఇచ్చావ్..
ఇలా ఈ ఆనందాన్ని, ఎంటర్టెన్మెంటును ప్రపంచంలో ఎంత మంది ఉంటే అందరికీ...
దేశంలో వీలైనంత మందికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. నువ్వు ఇస్తావ్... ఎందుకంటే నువ్వు గాడ్.

యాంకర్ సుమ ఎండింగ్ పంచ్
హరితేజ ఆ కవిత చెప్పగానే సుమ స్పందిస్తూ.. ‘ దేవుడా ఎందుకు ఈ కార్యక్రమానికి సుమను యాంకర్‌గా ఇచ్చావ్' అంటూ ఎండింగ్ పంచ్ ఇచ్చి అందరినీ నవ్వించింది.
హరితేజ ఫసక్ స్టోరీ
నువ్వు ఈ సినిమాలో ఫ్రస్టేటెడ్ వైఫ్‌గా నటిస్తున్నావా? అని సుమ అడగ్గా... కాదు ఫసక్, ఈ ఫసక్ స్టోరీ మీరు జనవరి 12న సినిమాలో చూడబోతున్నారని హరితేజ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











