For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Miss Universe 2021: విశ్వ సుందరిగా భారత యువతి.. ఆ హీరోయిన్ల తర్వాత ఈమె.. ఫినాలేలో అడిగిన ప్రశ్న ఇదే

  |

  మోడలింగ్ రంగంలో ఎంతో మంది అమ్మాయిలు తమ అందచందాలతో మాయ చేస్తుంటారు. వాళ్ల కోసం ఎన్నో రకాల పోటీలు జరుగుతూ ఉంటాయి. అందులో మిస్ యూనివర్శ్ పోటీలు ఎంతో ముఖ్యమైనవిగా చెబుతుంటారు. దీనికి కారణం ఇందులో అందంతో పాటు మోడళ్ల తెలివితేటలకు కూడా పరీక్షలు పెడుతూ ఉంటారు. ఈ రెండింటిలో మంచిగా రాణించిన వాళ్లకే కిరీటాన్ని అందిస్తుంటారు. ప్రతి ఏటా ఈ పోటీలను జరుపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే మిస్ యూనివర్శ్ 2021 కాంపిటీషన్ ఇజ్రాయేల్‌లోని ఇలాట్‌ నగరంలో జరిగింది. ఇందులో భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు విజేతగా నిలిచింది. తద్వారా 130 కోట్ల ఇండియన్స్ సుదీర్ఘ నిరీక్షణకు తెర దించింది. ఆమె వివరాలు మీకోసం!

  80 మందిని దాటేసి విజేతగా నిలిచి

  80 మందిని దాటేసి విజేతగా నిలిచి

  70వ మిస్ యూనివర్శ్ 2021 కాంపిటీషన్ ఇజ్రాయేల్‌లోని ఇలాట్‌ నగరంలో జరిగింది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల నుంచి 80 మంది మోడళ్లు పోటీ పడ్డారు. అందులో భారతదేశానికి చెందని హర్నాజ్ సంధు కూడా ఉంది. ఇక, ఈ పోటీలో అందంతో పాటు తన మేథాశక్తితో న్యాయ నిర్ణేతలను మెప్పించిన ఆమె.. మిస్ యూనివర్శ్‌గా విజయం సాధించింది.

  Bigg Boss Winner: తొలిరోజు షాకింగ్ ఓటింగ్.. టాప్‌లో ఆ కంటెస్టెంట్.. ఇదే కంటిన్యూ అయితే అతడే విన్నర్

  21 ఏళ్ల అనంతరం భారతదేశానికి


  21 ఏళ్ల తర్వాత హర్నాజ్ సంధు భారతదేశానికి మిస్ యూనివర్శ్ కిరీటం అందించింది. ఈమె కంటే ముందు ఇద్దరు ఇండియన్స్ ఈ ఘనతను అందుకున్నారు. 1994లో సుస్మితా సేన్ మిస్ యూనివర్శ్‌గా నిలిచింది. ఆమె తర్వాత 2000లో లారా దత్తా ఈ కిరీటాన్ని అందుకుంది. మళ్లీ ఇప్పుడు హర్నాజ్ సంధు ఆ లోటును భర్తీ చేసింది. దీంతో ఇండియన్స్ ఖుషీ అవుతున్నారు.

  చెక్‌దే ఇండియా అంటూ గర్వంగా

  ఇజ్రాయేల్‌లోని ఇలాట్‌ నగరంలో జరిగిన 70వ మిస్ యూనివర్శ్ 2021 పోటీల్లో విజయం సాధించిన తర్వాత హర్నాజ్ సంధు ఎమోషనల్ అయిపోయింది. ఆనందంతో ఏడుస్తూ కనిపించింది. ఆ తర్వాత 'చెక్‌ దే ఇండియా.. చెక్‌ దే ఇండియా.. మిమ్మల్ని గర్వంగా నిలిచేలా చేశాను' అంటూ చెప్పుకొచ్చింది. ఆమె విజయంపై 130 కోట్ల భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  Akhanda: బడా సంస్థ చేతికి హిందీ డబ్బింగ్ రైట్స్.. బాలయ్య పాత్రను బాలీవుడ్‌లో ఎవరు చేస్తారంటే!

  ఈ ప్రశ్నకు అదిరిపోయే జవాబుతో

  ఈ ప్రశ్నకు అదిరిపోయే జవాబుతో

  పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో ఫైనల్ రౌండ్‌ వరకూ చేరుకున్న హర్నాజ్ సంధును.. న్యాయ నిర్ణేతలు 'ఇప్పటి యువతకు మీరిచ్చే సందేశం ఏంటి' అని ప్రశ్నించారు. దీనికామె 'యువత పక్క వాళ్లతో పోల్చుకోకూడదు. ఎవరికి వాళ్లే నాయకులు. మన లైఫ్‌కు మనమే లీడర్స్. మన ఆశలకు, ఆశయాలకూ పట్టపగ్గాలు లేకుండా చూసుకోవాలి. అందుకే నేను ఇక్కడ ఉన్నా' అని బదులిచ్చింది.

  హర్నాజ్ సంధు ఎక్కడి అమ్మాయి

  హర్నాజ్ సంధు ఎక్కడి అమ్మాయి

  హర్నాజ్‌ కౌర్‌ సంధు పంజాబ్ రాష్ట్రంలోని చంఢీఘర్‌లో 2000లో జన్మించింది. శివాలిక్‌ పబ్లిక్‌ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసింది. తర్వాత ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. ప్రస్తుతం పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తోంది. చిన్నప్పటి నుంచి ఆమె యోగా ఔత్సాహికురాలేగాక, ఫిట్‌నెస్‌ లవర్‌. గుర్రపు స్వారీ, ఈత, డ్యాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్‌ అంటే ఇష్టం.

  Disha Patani: దారుణమైన సెల్ఫీతో షాకిచ్చిన హీరోయిన్.. ఏకంగా షార్ట్‌ను కిందకు జరిపి మరీ!

  Recommended Video

  Good Luck Sakhi Movie Also in OTT : Keerthy Suresh

  సినిమాల్లోనూ నటించిన హర్నాజ్

  చిన్న వయసు నుంచే మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న పంజాబీ బ్యూటీ హర్నాజ్ సంధు.. సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'బాయి జీ కుట్టాంగే', 'యారా దియా పూబరన్‌' అనే పంజాబీ సినిమాలలో నటించింది. అలాగే, పంజాబీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనూ మాట్లాడుతుంది. మరీ ముఖ్యంగా పర్యావరణాన్ని అమితంగా ప్రేమిస్తుంది.

  English summary
  21 year old Indian model Harnaaz Sandhu Becomes The Miss Universe 2021. She Brings Crown To India After 21 Years.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X