'ఆరెంజ్'.. ఆడియో రిలీజ్ అయ్యాక కూడా మరో పాట
రీసెంట్ గా మొన్న రామ్ చరణ్ తాజా చిత్రం ఆరెంజ్ కి ఆడియో పంక్షన్ జరిగిన సంగితి తెలిసిందే. అలాగే పాటలకు కూడా మంచి అప్రిశియేషన్ వచ్చింది. దాంతో ఆ ఉత్సాహంతో సంగీత దర్శకుడు హారీస్ జయరాజ్ ఈ చిత్రం కోసం మరో పాటను కంపోజ్ చేసారు. ప్రస్తుతం చెన్నైలో రీరికార్డింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలోని ఓ సిట్యువేషన్ కి ఎక్సైట్ అయిన హారీస్ ఈ పాటను రికార్డ్ చేసారని చెప్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు భాస్కర్ కన్ఫర్మ్ చేస్తూ...హారీస్ మరో బిట్ సాంగ్ ని ఆరెంజ్ కోసం కంపోజ్ చేసారు. బ్యూటిఫుల్ మెలోడి అది. నాకు బాగా నచ్చింది అన్నారు. అయితే దాన్ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ క్రిందే ఉపయోగిస్తారని చెప్పారు. ఇక ఈచిత్రం పాట చిత్రీకరణ సిడ్నీలో జరుగుతోంది. నవంబర్ 12న ఈ చిత్రం విడుదల తేదీని నాగబాబు ఎనౌన్స్ చేసారు. మగధీర తర్వాత విడుదల అవుతున్న చిత్రం కావటంతో అన్ని చోట్లనుంచి మంచి బిజెనెస్ రెస్పాన్స్ వస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











