twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవిశ్రీ ప్రసాద్‌ను ఎందుకు తప్పించారు?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సూర్య నటించిన సింగం, సింగం-2 చిత్రాలు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించాడు దేవిశ్రీ ప్రసాద్. త్వరలో సింగం-3 కూడా రాబోతోంది. తొలుత ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ పేరు ప్రకటించారు. ఏమైందో తెలియదు కానీ మళ్లీ సంగీతం దేవిశ్రీకే బాధ్యత అప్పగించారు.

    మరోసారి ‘సింగం-3' సినిమాకు సంగీత దర్శకుడిని మార్చారు. దేవిశ్రీని తప్పించి తాజాగా ఆ బాధ్యతలు హారిస్ జైరాజ్ కు అప్పగించడం చర్చనీయాంశం అయింది. ఈ మేరకు ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. దేవిశ్రీ హీరోగా ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్న నేపథ్యంలోనే దేవిశ్రీ కావాలనే తప్పుకున్నాడా? లేక మరేదైనా కారణంతో సింగం-3 దర్శకుడు హరి దేవిశ్రీని తప్పించాడా? అనేది తెలియాల్సి ఉంది.

     Harris Jayaraj Replaces Devi Sri Prasad for Singam 3

    హారిస్ జైరాజ్ గతంలో సూర్య నటించిన కాకా కాకా, గజిని, సూర్య సన్నాఫ్ కృష్ణన్, వీడొక్కడే, ఘటికుడు, సెవెన్త్ సెన్స్, బ్రదర్స్ వంటి సినిమాలకు సంగీతం అందించారు.

    సింగం-3 సినిమా వివరాల్లోకి వెళితే... తొలి రెండు చిత్రాల్లో సందడి చేసిన అనుష్క సింగం-3లోనూ నటిస్తోంది. సింగం-2లో సెకండ్ హీరోయిన్‌గా నటించిన హన్సిక స్థానానంలో శృతిహాసన్ నటిస్తోంది. డిసెంబర్-2 నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. వైజాగ్‌లో తొలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకోనుంది.

    English summary
    Harris Jayaraj Replaces Devi Sri Prasad for Surya's upcoming movie Singam 3.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X