twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హ్యారీ పాటర్‌ ఆరో అద్బుతం

    By Staff
    |

    ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఎదురుచూస్తోన్న హ్యారీ పాటర్‌ సినిమాల్లో ఆరో భాగం సిద్ధమవుతోంది. 'హ్యారీ పాటర్‌ అండ్‌ ది హాప్‌ బ్లడ్‌ ప్రిన్స్‌' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బడ్జెట్‌ అక్షరాలా 1200 కోట్లు. అయిదో భాగమైన 'హ్యారీ పాటర్‌ అండ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ఫినిక్స్‌' రూపొందించిన దర్శకుడు డేవిడ్‌ యేట్స్‌ దీన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. జె.కె.రోలింగ్‌ రాసిన నవల ఆధారంగా 'హ్యరీ పాటర్‌' సిరీస్‌ చిత్రాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. ఐమ్యాక్స్‌-3డీ విధానంలో సిద్ధమవుతున్న ఈ సినిమాను కొన్ని ప్రాంతాల్లో వీలు కుదరకపోవడం వల్ల 2డీ విధానంలోనూ చూపించబోతున్నారు. తాజా సిరీస్‌లో కళ్లు చెదిరే సెట్స్‌ వేసినట్లు సమాచారం. ఆస్కార్‌ అవార్డు గ్రహీత స్టూవర్ట్‌ క్రెయిగ్‌ రూపొందించిన అత్యద్భుత నిర్మాణాలు ఈ చిత్రానికి అదనపు సొబగులు అద్దుతాయని దర్శకుడు డేవిడ్‌ యేట్స్‌ చెబుతున్నారు. గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌కి కూడా ఇందులో సముచిత స్థానం కల్పించామని ఆయన వెల్లడించారు. డేనియల్‌ ర్యాడ్‌ క్లిఫ్‌, రూపర్ట్‌ గ్రింట్‌, ఎమ్మా వాట్సన్‌, మైఖేల్‌ గాంబన్‌, జిమ్‌ బ్రాడ్‌ బెంట్‌, అలన్‌ రిక్‌మ్యాన్‌, టామ్‌ ఫెల్టన్‌, హెలెన్‌ మెక్రోరీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మూల కథ: జె.కె.రోలింగ్‌, స్క్రీన్‌ ప్లే: స్టీవ్‌ క్లోవ్స్‌, సంగీతం: నికోలస్‌ హూపర్‌, థీమ్స్‌: జాన్‌ విలియమ్స్‌, కెమెరా: బ్రూనో డెల్‌బోనల్‌, ఎడిటింగ్‌: మార్క్‌డే. విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X