twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రేజీ ఫిల్మ్...'హ్యారీపోటర్‌-7' విడదల ఈ రోజే (ప్రివ్యూ)

    By Srikanya
    |

    'హ్యారీపోటర్‌ 7" చిత్రం ఈ రోజు (నవంబర్‌ 19) తెలుగు సహా ప్రపంచవ్యాప్తంగా అన్నిభాషల్లో ఈ చిత్రం విడుదలవుతోంది. ఇప్పటికి ఆరు భాగాలుగా విడుదలై సంచలన విజయాలు అందుకున్న 'హ్యారీపోటర్‌" సిరీస్‌ నుంచి వస్తున్న మరో ఉత్కంఠభరిత చిత్రం అని దర్శక, నిర్మాతలు చెప్తున్నారు. ఇక హ్యారీ పోటర్ వరస సీరిస్ రచయిత్రి జె.కె.రౌలింగ్‌ రచన 'హ్యారీపోటర్‌ అండ్‌ ద డెత్లీ హాలోస్‌" ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఈ సినిమాని వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థ భారీ ఎత్తున గ్రాఫిక్స్ తో రూపొందించిందారు. తెలుగులో రత్న సెల్యులాయిడ్స్‌ సమర్పణలో మల్టీడైమన్షన్‌ సంస్థ విడుదల చేస్తోంది. 'మృత్యు రహస్యం" అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం. హ్యారీ మిత్రబృందం ఓ మంత్ర నగరిని సర్వనాశనం చేయాలని చేసే ప్రయత్నంలో జరిగిన విశేషాలను ఆసక్తికరంగా చెప్తుంది. కథ ప్రకారం హ్యారీపోట్టర్ తన మిత్రుడు రాన్ వీస్లే, ప్రియురాలు గ్రాంగర్‌ తో కలిసి లార్డ్ వోల్టెమార్ట్స్ అనే మంత్రనగరిని నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు. ఈ యత్నంలో వారు ఎలాంటి అవాంతరాలు ఎదుర్కొన్నారనేది ప్రధానాంశం. చివరి భాగంలో విలన్‌ పై హ్యారీపోట్టర్ సాధించే విజయం ప్రధానాంశం. ఈ సినిమాలో గ్రాఫిక్స్‌ సహా విజువల్‌ ఎఫెక్ట్‌‌ అద్భుతంగా అలరిస్తాయి. డేవిడ్‌ యేట్స్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే స్టీవ్‌ క్లోన్స్‌ అందించారు. తెలుగులో 'హ్యారీపోట్టర్-7'...125 ప్రింట్లతో 145 థియేటర్లలో విడుదలవుతోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X