సీన్ మారింది: రానా కాదుట...హర్షవర్దన్ రానే

By Srikanya

హైదరాబాద్ : దగ్గుపాటి రానా హీరోగా 'అవును' చిత్రానికి సీక్వెల్‌ చేస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఆ పాత్రలోకి ఇప్పుడు హర్షవర్దన్ రానే వచ్చాడు. రానా..బాహుబలి షూటింగ్ లో బిజీగా ఉండటంతో హర్షవర్ధన్ ని తీసుకున్నారని చెప్తున్నారు. హిట్టైన చిత్రానికి సీక్వెల్ కావటంతో ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే... రెండేళ్ల క్రితం తను రూపొందించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'అవును' చిత్రానికి సీక్వెల్‌గా మరో చిత్రాన్ని రూపొందించే సన్నాహాలు దర్శకుడు రవిబాబు ప్రారంభించారు. ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రం షూటింగ్‌ ఆగస్టు ఒకటిన ప్రారంభమై సింగిల్‌ షెడ్యూల్‌తో పూర్తవుతుంది. ఈ సినిమాకి 'అవును 2' అని వర్కింగ్‌ టైటిల్‌ అనుకొంటున్నట్లు యూనిట్‌ వర్గాలు వెల్లడించాయి.

Harshavardhan Rane in Avunu 2

'అవును' చిత్రంలో జంటగా నటించిన హర్షవర్థన్‌ రాణే, పూర్ణ సీక్వెల్‌లోనూ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. 'హర్షవర్థన్‌ నటించిన 'మాయ' చిత్రం ఆగస్ట్‌ ఒకటిన విడుదల కానుంది. ఆ రోజే 'అవును 2'షూటింగ్ ప్రారంభం కావడం గమనార్హం. 'అవును'లో నటించిన ఇతర తారాగణం సీక్వెల్‌ లోనూ నటించనున్నారు. సరికొత్తకథ, కథానాలతో ఈ చిత్రాన్ని రవిబాబు రూపొందించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X