For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీటూపై హీరోయిన్ ట్విస్ట్: వాళ్లతో పడుకున్నపుడు ఏమైంది? గంజాయి సేవిస్తూ, అర్ద నగ్నంగా...

  |

  దేశ వ్యాప్తంగా #మీటూ ఉద్యమం జోరుగా సాగుతుంటే... తాజాగా ఓ కన్నడ నటి ఇచ్చిన ట్విస్ట్ అందరినీ ఆలోచనలో పడేసింది. #మీటూ ఉద్యమాన్ని కొందరు పబ్లిసిటీ కోసం వాడుతున్నారంటూ కన్నడ నటి హర్షిక పూనాచా మీటూను దుర్వినియోగం చేస్తున్న హీరోయిన్లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

  #MeToo : Actress Khushboo Supports Arjun Sarja

  కొందరు హీరోయిన్లు పెద్ద సినిమాల్లో అవకాశాలు, వాటి ద్వారా వచ్చే డబ్బు, విదేశీ టూర్లు, లగ్జరీ లైఫ్ కోసం ఎంటి నీచానికి పాల్పడతారో ఆమె బయట పెట్టారు. వారి పేర్లు బయట పెట్టకుండా ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉంటుందో కళ్లకుకట్టినట్లు చెప్పే ప్రయత్నం చేసింది.

  మహిళలను గౌరవించాలి

  మహిళలను గౌరవించాలి

  మహిళలకు ప్రతి ఒక్కరూ గౌరవం ఇవ్వాలి, వారిని వేధింపులకు గురి చేయడం సరికాదు, వారి అనుమతి లేకుండా ఎలాంటి పనులు చేయకూడదు అని తన పేస్ బుక్ పోస్టు ద్వారా చెబుతూనే కొందరు హీరోయిన్లు తమ ఫెమినిటీని పబ్లిసిటీ కోసం ఎలా వాడుకుంటున్నారో వివరించే ప్రయత్నం చేశారు.

  అర్జున్ సార్జాకు మద్దతు

  అర్జున్ సార్జాకు మద్దతు

  మీటూ ఉద్యమం నేపథ్యంలో ప్రముఖ నటుడు అర్జున్ సార్జా మీద వచ్చి ఆరోపణలను ఖండిస్తూ అతడికి మద్దతు పలికి హర్షిక పూనాచా... ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు ఎలా ఉంటారో చెప్పే ప్రయత్నం చేశారు.

  అప్పుడు ఈ మగాళ్లకు ఫ్రీడమ్ ఇచ్చి, ఇపుడు టార్గెట్

  అప్పుడు ఈ మగాళ్లకు ఫ్రీడమ్ ఇచ్చి, ఇపుడు టార్గెట్

  మీటూ ఉద్యమంలో భాగమైన కొందరు హీరోయిన్లు తమ కెరీర్ తొలినాళ్లలో మంచి సినిమాలు, డబ్బు, సెలబ్రిటీ సర్కిల్, విదేశీ ప్రయాణాలు, విలాసవంతమైన జీవితం పొందడానికి ఈ మగాళ్లకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఇప్పుడేమో తమ పబ్లిసిటీ కోసం అదే మగాళ్లపై ఆరోపణలు చేస్తున్నారు. ఒకప్పుడు ఈ మగాళ్లతో చేతుల్లో చేయి వేసుకుని నవ్వుతూ నడిచిన సోకాల్డ్ హీరోయిన్లు ఇపుడు వారినే టార్గెట్ చేస్తున్నారని హర్షిక పూనాచా తెలిపారు.

  స్టార్ల మీద ఆరోపణలు ఉండవా?

  స్టార్ల మీద ఆరోపణలు ఉండవా?

  ఏ నటికైనా టాప్ పొజిషన్లో ఉన్న సూపర్ స్టార్ల మీద ఆరోపణలు చేసే దమ్ముందా? అంటూ హర్షిక పూనాచా ప్రశ్నించారు. అదే సమయంలో ఏ ఇండస్ట్రీకి స్టార్ హీరోయిన్ల నుంచి ఇలాంటి ఆరోపణలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.

  వారితో పడుకున్నపుడు మీటూ ఏమైంది?

  వారితో పడుకున్నపుడు మీటూ ఏమైంది?

  మీ స్వప్రయోజనాల కోసం, అవకాశాల కోసం వాళ్లతో పడుకున్నపుడు, వారి చుట్టూ తిరిగినపుడు మీటూ ఉద్యమం ఏమైందంటూ హర్షిక పూనాచా ఘాటుగానే ప్రశ్నించారు.

  గంజాయి తాగుతూ, అర్దనగ్నంగా...

  గంజాయి తాగుతూ, అర్దనగ్నంగా...

  తనకు సన్నిహితంగా ఉండే ఓ నిర్మాత మీటూ ఉద్యమంలో భాగమైన కొందరు హీరోయిన్లకు సంబంధించిన వీడియో చూపించారని, అందులో వారు గంజాయి సేవిస్తూ ప్రముఖుల భుజాలపై చేయి వేసి మాట్లాడుతూ కనిపించారని, మరో వీడియోలొ ఓ ప్రముఖ నటుడు తన కారులో అర్దనగ్నంగా ఉన్న నటితో తన తర్వాతి సినిమాలో నీకు తప్పకుండా ఛాన్స్ ఉంటుందని చెప్పడం కనిపించిందని తెలిపారు.

  పబ్లిసిటీ కోసం వాడొద్దు

  పబ్లిసిటీ కోసం వాడొద్దు

  ఇక్కడ మీటూ ఉద్యమాన్ని తప్పుబట్టం లేదు. దీన్ని అడ్డం పెట్టుకుని కొందరు పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారు. అలాంటి వారిని ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు హర్షిక పూనాచా వ్యాఖ్యానించారు.

  English summary
  Over the past few days, several women have been naming and shaming sexual predators as part of the #MeToo campaign and trying to make the workplace safe. As expected, this has affected those in the film world as well. So far, the likes of Arjun Sarja, Radha Ravi and Tamil lyricist have been accused of misconduct. Now, in a shocking development, the upcoming Sandalwood actress Harshika Poonacha has made a few hard-hitting comments about the #MeToo campaign.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more