రామ్ చరణ్ ని పట్టుకుని నా భర్తవంటూ ఏడుపు
కొద్ది రోజుల క్రితం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒకమ్మాయి రామ్ చరణ్ ని చూసి గట్టిగా ఏడ్చుకుంటూ వచ్చి క్రితం జన్మలో నువ్వు నా భర్తవి అందిట.రామ్ చరణ్ తేరుకునే లోగా తాను ఫాస్ట్ లైఫ్ ధెరఫీ సెషన్ కి అటెండయి తెలుసుకున్నానని, తనను అన్యాయం చేసి పెళ్లి చేసుకోవద్దని ఏడవటం మొదలెట్టింది.ఇదంతా రచ్చ షూటింగ్ లో చోటు చేసుకుందని రామ్ చరణ్ స్వయంగా చెప్తున్నాడు. అంతేగాక తనను కౌగలించుకుని ఏడుస్తూ వెళ్ళిపోయిందిట. ఇలాంటి సంఘటనలు తనకు ఉపాసనకు వివాహం అని న్యూస్ రాగానే చాలా వచ్చాయని, తను ఎలా డీల్ చెయ్యాలో తెలియటం లేదని అంటున్నాడు. అంతేగాక తన తల్లి స్నేహితురాలు కూతురు ఒకామె ఉపాసన ఎందుకు నేను చేసుకుంటాను మీ అబ్బాయిని అని వెంటబడిందని అంటున్నాడు.
ఇలాంటి సిట్యువేషన్స్ ఎలా హేండిల్ చెయ్యాలనేది సమస్యగా మారిందని చెప్తున్నాడు. రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం చస్తున్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ' సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.


Click it and Unblock the Notifications











