»   » కత్రినాతో ఎఫైర్ రట్టు చేసే ఆలోచనలో ఉన్నాడా?

కత్రినాతో ఎఫైర్ రట్టు చేసే ఆలోచనలో ఉన్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ మధ్య కొంతకాలంగా ఎఫైర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. వీరి మధ్య 'సం'బంధం ఉందనే విషయాన్ని బట్టబయలు చేసే ఎన్నో ఫోటో సాక్ష్యాలు మీడియాలో హల్ చల్ చేసాయి. అయితే వీరు మాత్రం తమ మధ్య ఉన్న సంబంధం గురించి బయట పెట్టకుండా మీడియాతో దోబూచులాడుతూనే ఉన్నారు.

రణబీర్ కపూర్‌తో పాటు కత్రినా కైఫ్ కూడా అనేక సందర్భాల్లో తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని ఖండిస్తూ వచ్చింది. అసలు అలాంటి ప్రశ్నలు వేయడానికి మీడియా వారికి వీలైనంత వరకు అవకాశం ఇవ్వకుండా తప్పించుకు తిరుగడం ప్రారంభించారు. ఎంత దాచాలని ప్రయత్నించినా ఇలాంటి సంబంధాల విషయం ఎంతకాలమని బయటకు రాకుండా ఆపగలరు.

గతంలో రణబీర్, కత్రినా అనేక సార్లు పబ్లిక్ ఫంక్షన్లలో చట్టాపట్టాలేసుకుని తిరిగారు. పలు పార్టీల్లో రాసుకుపూసుకుని తిరిగారు. సినీ రంగంలో ఇలాంటి కామనే అనుకున్నా....వీరి వ్యవహార శైలి మాత్రం అందరూ అనుమాన పడేలా ఉండేది. ఇటీవల లూటేరా మూవీ స్పెషల్ షోకు కూడా ఇద్దరూ కలిసి ఒకే కారులో వచ్చారు.

ఒకే కారులో వచ్చినంత మాత్రాన అనుమాన పడాలా? అని సరిపెట్టుకున్నా....వారు తమ ముఖాలు మీడియాకు కనిపించకుండా దాచుకునే ప్రయత్నం చేసారు. దీనర్థం ఏమిటి? అని అంతా అనుమాన పడేలా చేయడం వారి ప్రవర్తనలో ఉద్దేశ్యం. ఈ లోపే మళ్లీ రణబీర్ మీడియా వారికి థమ్సప్ సిగ్నల్ సిగ్నల్ ఇచ్చాడు. కత్రినా కూడా అలానే వ్యవహరించింది. తాజాగా వీరి వ్యవహారం చూస్తుంటే తమ మధ్య ఉన్న ఎఫైర్ బయట పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

రణబీర్ కపూర్-కత్రినా కైఫ్

రణబీర్ కపూర్-కత్రినా కైఫ్


బాలీవుడ్ స్టార్స్ అయిన రణబీర్ కపూర్, కత్రినా కైప్ గత కొంత కాలంగా పీకల్లోతు ప్రేమాయణంలో మునిగి తేలుతున్నారు. అయితే తమ మధ్య ఉన్న సంబంధం గురించి బయట పెట్టకుండా కొన్ని సంవత్సరాలుగా మీడియాతో దోబూచులాడుతూనే ఉన్నారు.

అబ్బే అదేం లేదంటూ...

అబ్బే అదేం లేదంటూ...


అనేక సందర్భాల్లో వీరి మధ్య ఉన్న సంబంధం గురించి మీడియా వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అయితే వారు మాత్రం అబ్బే అదేం లేదండీ, మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసారు.

ఎఫైర్ విషయం బయట పెట్టాలనే ఆలోచనలో ఉన్నారా

ఎఫైర్ విషయం బయట పెట్టాలనే ఆలోచనలో ఉన్నారా


అయితే ఇలాంటి సంబంధాలు ఎంతకాలని ఆపగలరు చెప్పండి. తాజాగా వీరి వ్యవహార శైలి పరిశీలిస్తుంటే ఇక తమ మధ్య ఉన్న ఎఫైర్ విషయం ఓపెన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఎప్పుడు వీరు విషయం ఓపెన్ చేస్తారో చూడాలి.

అప్పుడు జస్ట్ ఫ్రెండ్స్ అన్నారు

అప్పుడు జస్ట్ ఫ్రెండ్స్ అన్నారు


గతంలో రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ అనేక సందర్భాల్లో పబ్లిక్ ఫంక్షన్లలో కలిసి కనిపించారు. ఆ సందర్భంలో వాళ్లు కేవలం స్నేహితుల్లానే బిహేవ్ చేసారు. అప్పట్లో వారి ప్రవర్తనపై ఎవరికీ పెద్దగా అనుమానాలు ఉండేవి కాదు.

కపూర్ ఫ్యామిలీతో కలిసి కత్నినా డిన్నర్

కపూర్ ఫ్యామిలీతో కలిసి కత్నినా డిన్నర్


ఇటీవల కత్రినా కైఫ్ రణబీర్ కపూర్, అతని తల్లి నీతూ సింగ్‌తో కలిసి డిన్నర్ చేస్తూ దర్శనం ఇచ్చింది. దీంతో కత్రినా కపూర్ ఫ్యామిలీకి బాగా దగ్గరైందని, వీరి ప్రేమ వ్యవహారానకి వారి ఇంట్లో కూడా ఓకే అన్నారనే ప్రచారం జరిగింది.

విదేశాల్లో జల్సా...

విదేశాల్లో జల్సా...


ఇటీవల రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ కలిసి విదేశాలకు వెళ్లి జల్సా చేసి వచ్చారు. స్పెయిన్లోని ఇబిజాలో వీరిద్దరూ కలిసి పార్టీలు పబ్బులు అంటూ తిరిగి తెగ ఎంజాయ్ చేసారు. ఈ వ్యవహారంతో వీరి మధ్య ప్రేమ వ్యవహారం దాదాపు బట్టబయలైంది.

మీడియాకు మస్కా కొట్టిన సందర్భాలెన్నో

మీడియాకు మస్కా కొట్టిన సందర్భాలెన్నో


అనేక సందర్భాల్లో కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ కలిసి పార్టీలు ఫంక్షన్లకు హాజరయ్యారు. అయితే ప్రతి సందర్భంలోనూ వీరు మీడియా నుంచి తప్పించుకునే ప్రయత్నంచేసారు. ఫోటో గ్రాఫర్లకు దొరకకుండా మొహం చాటేసేవారు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.

లూటేరా స్క్రీనింగ్ సందర్భంగా..

లూటేరా స్క్రీనింగ్ సందర్భంగా..


సోనాక్షి సిన్హా, రణవీర్ సింగ్ కలిసి జంటగా నటించిన బాలీవుడ్ మూవీ లూటేరా స్పెషల్ స్క్రీనింగ్ ఇటీవల ముంబైలో ఏర్పాటు చేసారు. ఈ షోకు రణబీర్, కత్రినా కలిసి హాజరయ్యారు. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

ఎందుకలా చేసారు?

ఎందుకలా చేసారు?


లూటేరా స్క్రీనింగ్ సందర్భంగా రణబీర్-కత్రినా కలిసి ఒకే కారులో వచ్చారు. అయితే వీరు మీడియాకు తమ ముఖాలు కనిపించకుండా కవర్ చేసుకుని ఫోటోలకు చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నం చేసారు. మరి ఎందుకు అలా చేసారో?

మళ్లీ ఇలా...

మళ్లీ ఇలా...


మీడియా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి...ఈలోపే మళ్లీ భిన్నంగా ప్రవర్తించారు. రణబీర్ తన చేతి బ్రొటన వేలు పైకి లేపి మీడియాకు సిగ్నల్ ఇచ్చారు. ఆయన ప్రవర్తన బట్టి తమ మధ్య ఉన్న ఎఫైర్ బయట పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Bollywood's rumoured couple Ranbir Kapoor and Katrina Kaif have been playing the hide and seek game with the media for years now. Both Ranbir and Kat have either denied their rumoured affair, or tried to dodge affair related tricky questions by the media. But now, after witnessing the recent speculations, it looks like the love birds are tired of this game and have possibly decided to come clean on their relationship.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu