వర్మ స్పీడుకు ఆ నిర్మాత బలి

By Srikanya

తమ చిత్రం లవ్ ఎఫైర్ ని కాపీ కొట్టి రామ్ గోపాల్ వర్మ నాటే ఎ లవ్ స్టోరీ చిత్రం తీసారంటూ నిర్మాత షరీఫ్ జుబేరీ పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత వర్మ తీరిగ్గా అస్సలా నిర్మతనే చూడలేదని, అస్సలు ఆ సినిమా గురించే వినలేదని చెప్పాడు. అయితే ఈ సమస్య ఎక్కడ ప్రారంభమైందంటే వర్మకన్నా ముందే వాళ్ళు ఇదే పాయింటుతో సినిమా మొదలెట్టి దాదాపు డబ్బై ఐదు శాతం సినిమా పూర్తి చేసి ఫైనాన్సియల్ సమస్యలతో ఆపుచేసారు. అయితే వర్మ లేటుగా మొదలెట్టి స్పీడుగా ఫినిష్ చేసి అంతకన్నా స్పీడుగా విడుదలకు సిద్దం చేసారు.వర్మ పబ్లిసిటీ తుఫానులో అస్సలు లవ్ ఎఫైర్ అనే సినిమా ఉందనే విషయం కూడా జనాలు గుర్తించలేదు.

అయితే ఏం చేయాలో అర్దం కాని నిర్మాతలు అడ్డంగా వర్మపై వాదనకు దిగుతున్నారు. తమ చిత్రం కథని ఫిల్మ్ రైటర్స్ అశోశియేషన్ లో రిజస్టర్ చేసామని, దాన్ని తెలుసుకుని వర్మ కాపీచేసాడని వారు వాదిస్తున్నారు.అలాగే వర్మకు రెండు ఆప్షన్ లు ఇచ్చారు.అవి తమకు కాంపన్షషన్ ఇవ్వటం లేదా తమ సినిమా విడుదల అయ్యాక నాటే ఎ లవ్ స్టోరీని విడుదల చెయ్యటం అని. రామ్ గోపాల్ వర్మ వాటిని నవ్వుతూ కొట్టి పారేసారు.

నీరజ్ గ్రోవర్ అనే టీవీ చానెల్ ఉద్యోగిని మరియా సుసైరాజ్, ఆమె ప్రియుడు కలిసి హత్య చేయడాన్ని ఆధారంగా తీసుకొని వర్మ 'నాట్ ఏ లవ్ స్టోరీ"ని రూపొందించాడు. మూడేళ్ల శిక్ష అనంతరం మరియా ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. సునీల్ బోహ్రా నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. కన్నడ నటి మరియా, నేవీ మాజీ అధికారి ఎమైల్ జెరోమ్ మాథ్యూ కలిసి గ్రోవర్‌ను ఆమె ఫ్లాట్‌లోనే హతమార్చినట్టు కోర్టు నిర్ధారించింది. జెరోమ్‌కు ముంబై కోర్టు పదేళ్ల శిక్ష విధించడంతో అతను ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. మరో సంగతేమంటే గ్రోవర్‌ను హతమార్చాక.. ఆ శవం పక్కనే వీరిద్దరూ శృంగారంలో పాల్గొన్నారని వార్తలు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X