For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మాఫియా లేడీ గా, కళ్ళు చెదిరి పోతున్నాయ్: హసీనా ది క్వీన్ ఆఫ్ ముంబై పోస్టర్

  |

  అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా జీవిత నేపథ్యంలో 'హసీనా-ది క్వీన్‌ ఆఫ్‌ ముంబయి' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హసీనా పార్కర్ పాత్రని శ్రద్ధా కపూర్ పోషిస్తుండగా, దావూద్ పాత్రలో శ్రద్దా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ నటిస్తున్నాడు. ఈ సినిమా దావూద్ ఇబ్రాహిం సోదరీమణి హసీనా పర్కర్ జీవితం ఆధారంగా ఉంటుంది.

  బాలీవుడ్ పరిశ్రమలో

  బాలీవుడ్ పరిశ్రమలో

  ముంబై కేంద్రంగా నడిచే బాలీవుడ్ పరిశ్రమలో కొందరు అవకాశాలు లేని హీరోయిన్లు ముంబై డాన్లతో స్నేహం చేసి.... వారి అండతో అవకాశాలు తక్కించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయనే వాదన ఉంది. కొందరు హీరోయిన్లయితే ఏకంగా మాఫియా డాన్లతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, వారిని పెళ్లి చేసుకోవడం లాంటివి కూడా చేసారు.

   హసీనా పర్కర్ జీవిత

  హసీనా పర్కర్ జీవిత

  అయితే ఇప్పుడు డాన్ ఇబ్రహిం సోదరి హసీనా పర్కర్ జీవిత చరిత్ర కూడా తెరకెక్కనుంది. ఆమె జీవితంలో కొంత భాగం తెర పై చూపించబోతున్నారు.హసీన జీవితం పూర్తి ఎమోషనల్. ఓ వైపు అన్న పెద్ద డాన్. అతడికి చెల్లిగా ముంబైలో బతకాలంటే తను అంతకుమించిన డాన్ అయితేనే సాధ్యం.

  దావూద్ ముంబై వ్యాపారాలను

  దావూద్ ముంబై వ్యాపారాలను

  అందుకే ముంబై లోని ఓ ఏరియాలో ఈవిడను క్వీన్ గా ఆరాధించేవారు.హసీనా.. దావూద్ ముంబై వ్యాపారాలను, అక్రమ ఆస్తులను చూసేదని సమాచారం. నాగ్‌పాడాలోని గార్డన్ హాల్ అపార్టుమెంట్‌లో విలాసవంతమైన ఫ్లాట్‌లో ఉంటున్న ఆమెకు లేడీ డాన్‌గా గుర్తింపు ఉంది.

  మాఫియాను నడపకున్నా

  మాఫియాను నడపకున్నా

  ఆమె ప్రత్యక్షంగా మాఫియాను నడపకున్నా దక్షిణ ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఆమె ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదని అంటుంటారు. హసీనా భర్త ఇస్మాయిల్ పార్కర్‌ను 1991లో అరుణ్ గావ్లీ ముఠా హత్య చేయడంతో ఆమె వార్తల్లోకి వచ్చింది. దావూద్ ఇబ్రహీంకి ఉన్న 12 మంది అక్కజెళ్లెల్లలో హసీన పర్కర్ ఒక సోదరి.

  హసీన -ది క్వీన్ ఆఫ్ ముంబై

  హసీన -ది క్వీన్ ఆఫ్ ముంబై

  ముంబై నాగ్ పడ ప్రాంతంలో నివశించేది. అక్కడ తనకి బోలెడుమంది అభిమానులు శత్రువులు కూడా ఉండేవారు. అలాంటిచోట రాణిలా ఎలా బతికింది అన్నది హసీన -ది క్వీన్ ఆఫ్ ముంబై చిత్రంలో చూపించనున్నారు. దీని కోసం శ్రద్ధా ముందు టీనేజ్ గర్ల్ గా.. తరవాత యంగ్ మదర్ గా.. చివరికి 40 ఏళ్ల హసీనాగా కనిపించనుంది.

  డాది పాటు మేకప్ ఆర్టిస్టులతో కూర్చుని

  డాది పాటు మేకప్ ఆర్టిస్టులతో కూర్చుని

  హసీనా చాలా చిన్న వయసులోనే తల్లి అయింది. తనకు 23 వయసు ఉన్నప్పుడూ నలుగురు పిల్లలు.40 ఏళ్ల హసీనా కోసం ప్రోస్తెటిక్స్ ఉపయోగించి ఆ లుక్ ను శ్రద్దా కపూర్ పై క్రియేట్ చేశారట. ఒక ఏడాది పాటు డైరెక్టర్ అపూర్వ లఖియా మేకప్ ఆర్టిస్టులతో కూర్చుని మరి ఈ లుక్స్ డిజైన్ చేయించాడట.

  ప్రోస్తెటిక్స్ మేకప్

  ప్రోస్తెటిక్స్ మేకప్

  ఈ సినిమా కోసం అటు శ్రద్ధా, ఇటు సిద్ధాంత్ లు దుబాయ్ వెళ్ళి వాటి కుటుంబ సమాచారాలన్నీ కనుక్కున్నారు. మేకప్ ఆర్టిస్ట్ సుభాష్ షిండే ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల కోసం ప్రోస్తెటిక్స్ మేకప్ ఉపయోగించి పలు లుక్స్ డిజైన్ చేశాడు.ఆ మూవీ కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను ఇదివ‌ర‌కే త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది శ్ర‌ద్ధ‌.

  అచ్చంగా మాఫీయా క్వీన్ గా

  తాజాగా.. టీజ‌ర్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్ట‌ర్ పై '88 కేసులున్నా.. ఒక్క‌టంటె ఒక్క‌సారి మాత్ర‌మే కోర్టు కు హాజ‌ర‌యింది' అని రాసుంది. . ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసిన 4 గంట‌ల్లోనే సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్న‌ది ఈ టీజ‌ర్ పోస్ట‌ర్. ఆగ‌స్ట్ 18 న మూవీ రిలీజ్ కానుంది. అంకుర్ భాటియా..ఈ మూవీలో శ్ర‌ద్ధా భ‌ర్త‌గా న‌టిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ స్టిల్స్ ను శ్ర‌ద్ధా త‌న సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.. అచ్చంగా మాఫీయా క్వీన్ గా ఉన్న ఆమెను మీరూ చూడండి.

  English summary
  Shraddha Kapoor looks fierce in her new character poster
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X