14న నోవాటెల్ లో హాస్య'బ్రహ్మ'కు సన్మానోత్సవం..!
బ్రహ్మానందం గురించి ఈరోజు కొత్తగా చెప్పక్కర్లేదు. తన హాస్యాభినయంతో అఖిలాంధ్ర ప్రేక్షకులను మూడు దశాబ్దాలుగా అలరిస్తున్న నవ్వులరేడు తను. కేవలం బ్రహ్మానందం వల్లే హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రైవేట్ సంస్థలిచ్చిన పలు బిరుదులతో బాటు డాక్టరేట్, పద్మశ్రీ వంటి పురస్కారాలు కూడా అందుకున్నారాయన. అలాగే, అనతికాలంలో ఎక్కువ చిత్రాల్లో నటించి కమెడియన్ గా అంతర్జాతీయ స్ధాయిలో సైతం గుర్తింపు పొంది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం కూడా సంపాదించుకున్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదవడం తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ నటుడి చరిత్రలో లేదు.
ఈ నేపథ్యంలో ఈవెంట్స్ నిర్వహించడంలో మొదటినుంచి వినుత్నమైన శైలిని, విశిష్టతను కొనసాగిస్తూ వస్తున్న మాటీవీ ఆ పరంపరలో ఇప్పుడు డాక్టర్ బ్రహ్మానందం గారికి ఘన సన్మానం చేస్తోంది. గత సంవత్సరం తెలుగు మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు గారిని ఘనంగా సన్మానించిన విషయం తెలిసిందే. హైదరాబాదులోని నోవాటెల్ హోటల్ లో జరిగే ఈ వేడుకకి పలువురు సినీ ప్రముఖులు, నిర్మాతలు, హీరోలు హాజరుకానున్నారు.


Click it and Unblock the Notifications











