హ్యాట్రిక్ మిస్స్ అయినందుకు హ్యాపిగా
ఇటీవల 'కైట్స్, రావణ్" చిత్రాలతో వరుసగా రెండు ఘోర పరాజయాలను చవిచూసిన రిలయన్స్ బిగ్ పిక్చర్స్కి లక్కీగా హ్యాట్రిక్ మిస్ అయిందండీ. జూలై2న రిలీజ్ అయిన బిగ్ పిక్ఛర్స్ వారే సమర్పకులు కాగా ఆచిత్రానికి కాస్త ఆదరణ, అనుకూల స్పందన రావడం రిలయన్స్ వాళ్ళికి కొంచెం రిలీఫ్ నిచ్చిదని చెప్పాలి. విడుదలకు ముందే దాదాపు నాలుగు కోట్ల రూపాయల బిజినెస్ పూర్తి చేసుకున్న 'యముడు" చిత్రానికి ఆంధ్రలోని అన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్ళు లభిస్తున్నాయి. డబ్బింగ్ సినిమా పరంగా చూస్తే 'యముడు" రిజల్ట్ సూపర్ హిట్టని హ్యాపిగా చెబుతున్నారు చిత్ర నిర్మాతలు పంపిణీదారులు.


Click it and Unblock the Notifications











