twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ మాత్రానికే శృంగార చిత్రం అని ముద్రవేస్తే ఎలా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాలీవుడ్ మూవీ 'హేట్ స్టోరీ-2' చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలై హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో హీరో జై భానుశాలి, సుర్వీన్ చావ్లా మధ్య హాట్ హాట్ రొమాంటిక్ సీన్లు, ముద్దు సీన్లు, బెడ్రూం సీన్లు వేడి పుట్టించే విధంగా ఉండటంతో సినిమాలో అంతా సెక్స్ సీన్లతో నింపేసారనే విమర్శలు మొదలయ్యాయి.

    అయితే హీరో జై భానుశాలి మాత్రం ఈ చిత్రం సెక్స్ చిత్రం కాదని స్పష్టం చేసారు. కథ పరంగా అక్కడక్కడ కొన్ని రొమాంటిక్ సీన్లు మాత్రమే ఉన్నాయి. సినిమా చూడక ముందే ఇలాంటి ప్రచారం చేయడం సరికాదు. ఏవో కొన్ని సన్నివేశాలు తప్ప సినిమా అంతా మామూలుగానే ఉంటుంది అని తెలిపారు. సినిమాలో ఉండే పది సీన్లలో ఒకటి శృంగార సన్నివేశం ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. సినిమాలోని మిగతా విషయాలను వదిలేసి ఈ విషయాన్నే మీడియా వారు భూతద్దంలో పెట్టి చూడటం తగదని పేర్కొన్నారు.

     'Hate Story 2' not an erotic thriller

    గతంలో వచ్చిన 'హేట్ స్టోరీ' చిత్రానికి 'హేట్ స్టోరీ-2' చిత్రానికి ఎలాంటి సంబంధం ఉండదని జై భానుశాలి తెలిపారు. థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తే అన్ని అపోహలు తొలగిపోతాయని జై భాను శాలి తెలిపారు.

    విక్రమ్ భట్ 'హేట్ స్టోరీ 2' చిత్రాన్ని నిర్మిస్తుండగా....అతని అసిస్టెంట్ విశాల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. తన జీవితాన్ని, ప్రేమను నాశం చేసిన ఒక వ్యక్తిపై ఓ మహిళ ఎలా రివేంజ్ తీర్చుకుంది అనే కథాంశంతో ఈచిత్రం సాగుతుంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఈచిత్రంలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. జులై 18న సినిమా విడుదలవుతోంది.

    English summary
    
 The trailer of Bollywood film "Hate Story 2" indicates that it is an erotic thriller a la the first film. But lead actor Jay Bhanushali says the erotic scenes are restricted to just one song, and that there's a lot more to the film than bold scenes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X