హీరో గోపీచంద్ ధైర్యానికి హేట్సాఫ్!?
తెలుగు సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఏదో ఒక వారసత్వం పరిశ్రమలో ఉండితీరాల్సిన స్థితి ఉంది. అలా బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ ఉంటేనే సినిమాలో ఎంట్రీ ఉంటుంది. దానికి కాస్త ప్రతిభ తోడైతే ఆంధ్రప్రేక్షకులు అంగీకరిస్తారు. కానీ గోపిచంద్ కేవలం తన ప్రతిభతో పైకొచ్చిన హీరో. ఆయన తండ్రి బి. కృష్ణ దర్శకుడిగా అందరికీ తెలిసినా గోపీచంద్ ఆయన కొడుకుగా తెలిసింది చాలా తక్కువ మందికి.
విలన్ కమ్ హీరో గోపిచంద్ కు వీరోచితంగా పోరాడే కథలకు, వేటకొడవళ్ళు విఛ్చుకత్తులతో పోరాటాలే ఆయనను హీరో గా నిలబెట్టాయి. కానీ ఆయన కామెడీ ట్రాక్ లో తీసిన 'శంఖం" సినిమా ప్రేక్షకుల మెప్పు పొంద లేక పోయింది. అయినా గోపిచంద్ నిరాశ పడటంలేదు. మొదటి నుంచి నరకటాలు, కొట్టడాలు చూసిన ప్రేక్షకులు కామెడీ హీరో గా అంగీకరించాలంటే కొద్ది సమయం పడుతుంది అంటున్నాడు. కొత్త దనం కోసం గోపిచంద్ తపన నిజంగా అభినందించాల్సిందే కదా?
ప్రస్తుతం పూరి జగన్నాథ దర్శకత్వంలో ఎన్ కౌంటర్ బ్యాక్ డ్రాఫ్ తో రూపొందుతోన్న చిత్రం 'గోలిమార్" డిసెంబర్ లో మనముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో గోపిచంద్ సరసన 'దేశముదురు" క్యూట్ గర్ల్ హన్సిక నటిస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











