అభిమానులపై ఆక్రోశంతో రాజమౌళి..?
మెగాస్టార్ చిరంజీవి తన అభిమానుల చప్పట్ల కోసం ఎంత కష్టపడటానికైనా వెనుకాడరు. ఇప్పుడు చేస్తున్నారో తెలియదు కాని ఒకప్పుడు, ఏ(హీరో) సినిమా నచ్చినా ఆ సినిమా హీరోలకు ఫోన్ చేసి మరీ ప్రశంసించడం ఆయనకు అలవాటు. మనిషికి ఉత్సాహం ఇంధనం లాంటిది. ఒక కళా కారుడికి ఉత్సాహం ప్రశంసల ద్వారా లభిస్తుందన నిజం ఆయనకు బాగా తెలుసు. తనకు పోటి(ప్రత్యర్థులు) అయినా హీరోలకు కూడా ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయంటారు. కాని అది పబ్లిక్ కు తెలిసేది కాదు.
కానీ అభిమానులు అలా వుండరు. తమ హీరో ఫంక్షన్ లో ప్రత్యర్ది హీరో రెఫరెన్స్ వస్తేనే ఊరుకోరు. ప్రత్యర్ది హీరో యాక్ట్ చేసే యాడ్ ప్రొడక్ట్స్ ను యూజ్ చేయరు. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో వుంటాయి. ట్విటర్ లో ఇంచుమించు అందరి ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెపుతూ, ఆయన ఫాలోయర్స్ అందరికి ఎంతో ఇనస్పైరింగ్ వుండటంలో రాజమౌళి ముందుంటారు. ఒక హీరోని పొగిడితే, మా హీరోను ఎందుకు పొగడం లేదనే విమర్శలో.. ఆ హీరోను ఎందుకు పోగుడుతున్నావని విమర్శలో .. ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి.
వారందరికీ సమాధానం చెప్పలేక చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. ఈయన ఓపికకు జోహార్లు చెప్పకుండా ఉండలేము. ఈయన ఫ్యాన్స్ వెబ్ సైటు అని చెపుతూ డిష్కషన్ బోర్డ్స్ లో వేరే హీరోలను చాలా హీనంగా కించపరుస్తూ వ్రాసే ఫ్యాన్స్ ను చూస్తే, సినిమాలు తీయడం మానేసి జీవితం అంతా మారని వాళ్ళ మైండ్ కోసమే సరిపోతుంది.


Click it and Unblock the Notifications











