'రోబో' లో నాకు నచ్చిన సీన్ అదే...రాజమౌళి
రజనీకాంత్ "రోబో" చిత్రం స్టార్ డైరక్టర్స్ ని సైతం కదిలిస్తోంది. తాజాగా ప్రముఖ దర్సకుడు రాజమౌళి.."రోబో" గురించి మాట్లాడుతూ...శంకర్ చిత్రాలన్నిటిలోనూ నాకు తెలిసి ఉన్నంతవరకూ ఒకే ఒక్కడు, రోబో..రెండూ బెస్ట్ స్టోరీలైన్స్. అలాగే ఏ ఇతర డైరక్టరూ పట్టుకోలేనంతగా శంకర్ ..ఆడియన్స్ పల్స్ పట్టుకున్నారు. ఆయన ఊహా శక్తికి..దాన్ని సాధించే సామర్ధ్యానికి హాట్స్ ఆఫ్..ఇక రోబో చిత్రంలో రోబో చిట్టి..భగవంతుడు ఉనికి గురించి చెబుతూ...డా.వసీకరన్ తనకి దేముడు అని చెప్పటం తనకు బాగా నచ్చిన టచింగ్ సీన్..నేను దానికి బాగా మూవ్ అయ్యాను అన్నారు. ప్రస్తుతం రాజమౌళి..ఈగ ను రూపొందించే బిజీలో ఉన్నట్లు సమాచారం.
రాజమౌళి రోబో రజనీకాంత్ శంకర్ శివాజి ఐశ్వర్య రాయ్ rajamouli robo shankar rajinikanth maran aishwarya rai


Click it and Unblock the Notifications