బద్రినాథ్ తో రొమాన్స్ చేసే తమన్నా యాక్షన్ సీన్స్ లో టెన్షన్ పెట్టింది...!
బద్రినాథ్ సినిమాలో తమన్నా చేసిన అందాల విందే హైలైట్ అవుతోంది కానీ ఈ చిత్రానికి ఆమె చాలా కష్టపడిందట. దర్శకుడి వినాయక్ మాటల్లో చెప్పాలంటే 'ఇంతదాకా నాతో వర్క్ చేసిన హీరోయిన్లు ఎవరిలోను అంత డెడికేషన్, అంత కరేజ్ చూడలేదు. ఆమె సాహసానికి చూసి నాకే ఆశ్చర్యమనిపించింది" అంటూ వివి వినాయక్ మెచ్చుకున్నాడు.
ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో ఎత్తయిన బ్రిడ్జి మీదినుంచి తమన్నా నీటిలో పడిపోవాల్సి ఉంటుందని, ఆ సీన్ లో డూప్ వాడాలని అనుకున్నా కానీ వద్దని వారించి తనే చేసిందని, ఆమె చాలా తాళ్లు కట్టుకుని నీళ్లలోకి దూకుతుంటే చాలా టెన్షన్ పడ్డానని వినాయక్ చెప్పాడు. బద్రినాథ్ లో చాలా రిస్కీ సీన్స్ ఉన్నాయని, వాటిలో కొన్నిటిని తమన్నా కూడా చేసిందని, ఆమె డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అనీ అన్నాడు. తెరపై అందాల ప్రదర్శన చేసి ప్రేక్షకులని తన అభిమానులుగా మార్చుకుంటున్న తమన్నా తెరవెనుక ఇలాంటి సాహసాలతో దర్శకులకి కూడా ఫేవరెట్ హీరోయిన్ అవుతోంది. ఇప్పుడు వినాయక్ ఫీడ్ బ్యాక్ తో తన సెక్స్ ట్ సినిమాలో తమన్నాని కథానాయికగా రాజమౌళి తీసుకున్నా ఆశ్చర్యం లేదు.


Click it and Unblock the Notifications











