Don't Miss!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
భగవంతుడు మీకిచ్చిన వరం.. మహేష్‌పై చిరు కామెంట్స్.. సూపర్ స్టార్‌పై ట్వీట్ల వర్షం!
సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే విషయం ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నయా రికార్డులు కొల్లగొడుతున్నారు. అత్యంత వేగంగా పది మిలియన్ల ట్వీట్లతో మహేష్ బాబు పుట్టిన రోజును ట్రెండ్ చేస్తున్నారు. ఆ యుద్దం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇదంతా ఒకవైపు.. మహేష్ బాబుకు బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని వైపుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
ప్రత్యేకంగా చిరు విషెస్..
మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన సెలెబ్రిటీల లిస్ట్ చదువుకుంటూ పోతే రోజంతా సరిపోతుంది. అయితే అందులో చిరంజీవి తెలిపిన విషెస్ అందర్నీ ఆకట్టుకుంది. ‘అందం, అభినయం భగవంతుడు మీకిచ్చిన వరం. మరెన్నో మరిచిపోలేని పాత్రలు చేయాలనీ, మీ కలలన్ని నెరవేరాలని కోరుకుంటూ, హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు' అని ట్వీట్ చేశాడు.
చిన్నోడికి పెద్దోడి విషెస్..
మహేష్ బాబు, వెంకటేష్‌లకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో కలిసిన బంధం అందరికీ తెలిసిందే. పెద్దోడు, చిన్నోడుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. నేడు పుట్టిన రోజు జరుపుకుంటోన్న చిన్నోడికి పెద్దోడు విషెస్ తెలిపాడు. ‘నా ప్రియ సోదరుడు మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీకు మున్ముందు విజయం చేకూరాలి' అంటూ వెంకటేష్ ట్వీట్ చేశాడు.
యంగ్ టైగర్ ట్వీట్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మహేష్ బాబులది కొరటాల కలిపిన బంధం. అంతకు ముందు నుంచి ఎంతో ఆప్యాయంగా ఉన్నాగానీ భరత్ అనే నేను ఈవెంట్లో ఎన్టీఆర్ ప్రత్యక్షం కావడంతో ఇంకాస్త పెరిగింది. నేటి మహేష్ బర్త్ డేకు ఎన్టీఆర్.. ‘హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు అన్న.. మున్ముందు అంతా మంచే జరగాలి' అని విషెస్ తెలిపాడు.
Recommended Video
అన్నీ ఇండస్ట్రీల నుంచి..
మహేస్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఇలా ఎంతో మంది సెలెబ్రిటీలు విషెస్ తెలిపారు. ఇంకా తెలుపుతూనే ఉన్నారు. మోహన్ లాల్, భరత్, రోజా, ఊర్వశీ రౌటేలా,సోఫి, అశోక్ గల్లా, మంచు మనోజ్, గోపీ మోహన్, మనోబాలా, కియారా అద్వాణీ, సంపత్ నంది, ఎస్ జే సూర్య, సునీల్, డేవిడ్ వార్నర్, అనిల్ సుంకర్, హరీష్ శంకర్, విజయ శాంతి, సుధీర్ వర్మ, కార్తికేయ, మెహర్ రమేష్, నీలిమా గుణ, అనిల్ రావిపూడి, కళైపులి ఎస్ థాను, నభా నటేష్, రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్, శృతీ హాసన్, కాజల్ అగర్వాల్, తరుణ్ భాస్కర్, కే రాఘవేంద్ర రావులు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.