HBD Mahesh Babu: చిన్నోడా అంటూ వెంకీ.. అన్నా అంటూ ఎన్టీఆర్.. చిరంజీవి, కేటీఆర్, కీర్తీ సురేష్ ఏమన్నారంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ట్విట్టర్‌లో ట్రెండింగ్ భారీగా జరుగుతున్నది. సర్కారు వారీ పాట సినిమా టీజర్‌ను రిలీజ్ చేయగా ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌గా మారింది. SSMB28, Sarkaru Vaari Paata హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్‌గా మారాయి. ఈ క్రమంలో సినీ పరిశ్రమలోని సెలబ్రిటీలందరూ మహేష్ బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. చిరంజీవి, కేటీఆర్, కీర్తీ సురేష్ లాంటి ప్రముఖులు ఏమన్నారంటే..

చిన్నోడా అంటూ వెంకీ ట్వీట్

మహేష్ బాబు, వెంకటేష్ మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మహేష్ బాబు బర్త్ డేను పురస్కరించుకొని వెంకటేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. హ్యాపీ బర్త్ డే చిన్నోడా... శాంతి, సు:ఖాలతో జీవితాన్ని ఆస్వాదించు. ఈ సంవత్సరం మీకు బ్రహ్మండంగా ఉండాలి. హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు అంటూ వెంకటేష్ ట్వీట్ చేశాడు.

మహేష్ అన్నా అంటూ.. యంగ్ టైగర్ ట్వీట్

మహేష్ అన్నా అంటూ.. యంగ్ టైగర్ ట్వీట్

ఇక మహేష్ బాబును ఎన్టీఆర్ అన్నా అంటూ జన్మదిన శుభాకాంక్షలు అందించారు. మహేష్ బాబు అన్న మీకు హ్యాపీ బర్త్ డే. ఈ సంవత్సరం కూడా మీకు గొప్పగా ఉండాలని కోరుకొంటున్నాను అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం RRR సినిమా కోసం ఎన్టీఆర్ జార్జియాకు వెళ్లిన సంగతి తెలిసిందే.

SSMB28 అప్ డేట్ అంటూ నాగవంశీ


నిర్మాత నాగవంశీ ట్వీట్ చేస్తూ.. మా సూపర్‌స్టార్ మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు. మీతో జర్నీ ప్రారంభమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. బ్యానర్ హారిక హాసినిపై రూపొందుతున్న #SSMB28 సినిమాకు సంబంధించిన వివరాలను ఆగస్టు 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు తెలియజేస్తాం అంటూ ట్వీట్ చేశారు.

రత్నవేలు ట్వీట్ చేసి..

మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ట్వీట్ చేస్తూ... మై డియర్ మహేష్ బాబుకు హ్యాపీయెస్ట్ బర్త్ డే విషెస్. జన్మదినాన్ని అద్బుతంగా జరుపుకోవాలి. ఈ సంవత్సరం మీకు మంచి విజయాలను అందించాలని కోరుకొంటున్నాను అని ట్వీట్ చేశారు.

 దిష్టి తీసుకో సూపర్ స్టార్..

దిష్టి తీసుకో సూపర్ స్టార్..

యువ హీరో నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు సార్.. జాతిరత్నాలు సినిమాను చూసి మీరు కురిపించిన ప్రశంస నాకు ఈ సంవత్సరంలో మరుపురాని విషయం. మీ ప్రశంసతో ఇంకా మంచి సినిమాలు చేయాలనే స్పూర్తిని నాలో కలిగించారు. సర్కారు వారీ పాట సినిమా టీజర్ చూశాను. నిజంగానే దిష్టి తీసుకోండి సార్ అంటూ సూపర్‌స్టార్‌కు బర్త్ డే విషెస్ అందజేశాడు.

ఆకాశానికి అంచనాలు అంటూ దర్శకుడు బాబీ

సూపర్ స్టార్ మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు. సర్కారు వారీ పాటతో సూపర్ స్టార్ మరో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. పరుశురాం, మహేష్ బాబు కాంబినేషన్‌లో అంచనాలు ఆకాశానికి అందాయి. డార్లింగ్ థమన్ మ్యూజిక్ బాగుంది అంటూ డైరెక్టర్ బాబీ ట్వీట్ చేశాడు.

హీరో రామ్ పోతినేని ట్వీట్

హీరో రామ్ పోతినేని ట్వీట్

మహేష్ బాబుకు హీరో రామ్ పోతినేని ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు అందించారు. హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్. మీ సర్కారు వారీ పాట సినిమా టీజర్ అదిరిపోయింది అంటూ ట్వీట్ చేశారు. ఈ ఏడాది మీకు భారీ విజయాలు దక్కాలని కోరుకొంటున్నాను.. మీ రాపో అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కౌశల్ మండా ట్వీట్ చేసి..

ఇక నటుడు, బిగ్‌బాస్ తెలుగు 2 విజేత కౌశల్ మండా తన అభిమానాన్ని చాటుకొన్నారు. మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ఫేవరెట్ హీరో, నా ప్రిన్స్ మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీకు సంపూర్ణమైన ఆరోగ్యం, సుదీర్ఘమైన జీవితం, ఎలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని భగవంతుడిని కోరుకొంటున్నాను. మీ ప్రోత్సాహం వల్లే నా ప్రయాణం మొదలైంది. మీతో గడిపిన సమయం మరిచిపోలేదు. సర్కారు వారీ పాట టీజర్ బాగుంది అంటూ కౌశల్ మండా వరుస ట్వీట్లు చేశారు.

 మా వన్ అండ్ ఓన్లీ ఒక్కడు

మా వన్ అండ్ ఓన్లీ ఒక్కడు

యువ నిర్మాత, దర్శకుడు గుణశేఖర్ కూతురు నీలిమ గుణ ట్వీట్ చేస్తూ.. వన్ అండ్ ఓన్లీ ఒక్కడు మహేష్ బాబుగారికి జన్మదిన శుభాకాంక్షలు. సర్కారు వారీ పాట మీ కెరీర్‌లో రికార్డులు తిరుగ రాయలి. బ్లాక్ బస్టర్‌గా నిలువాలి. థియేటర్లలో రిలీజైతే ఉండే హంగామాను చూడటానికి ఎదురు చూస్తున్నాను అంటూ నీలిమా గుణ ట్వీట్ చేశారు.

 ఎవర్ గ్రీన్ అందగాడు అంటూ చిరంజీవి విషెస్

ఎవర్ గ్రీన్ అందగాడు అంటూ చిరంజీవి విషెస్

ఎవర్ గ్రీన్ అందగాడు సూపర్ స్టార్ మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు. స్టైల్, టాలెంట్‌ మేలవించిన ఆయుధం లాంటి నటుడు. బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఈ సంవత్సరాన్ని గొప్పగా సాగించాలి. ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

వన్నెతరగని అందగాడు మహేష్ అంటూ..

వన్నెతరగని అందగాడు మహేష్ అంటూ..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నాకు తెలిసిన మంచి సూపర్ స్టార్‌కు హ్యాపీ బర్త్ డే. ఎప్పటికి వన్నెతరగని అందగాడు మహేష్ బాబుకు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలి అని కేటీఆర్ ఆకాంక్షించారు.

Recommended Video

RRR First Single Dosti Song Review | Filmibeat Telugu
వెండితెరపైనే కాదు.. అంటూ కీర్తీ సురేష్

వెండితెరపైనే కాదు.. అంటూ కీర్తీ సురేష్

వెండితెరపైనే కాదు.. వాస్తవ జీవితంలో కూడా మీరు నాకు స్పూర్తి. నా అమేజింగ్ సహ నటుడు, అందగాడుకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఉన్నట్టే మీ బర్త్ డే కూడా అమేజింగ్‌గా ఉండాలి మహేష్ బాబు సార్ అంటూ కీర్తీ సురేష్ ట్వీట్ చేశారు. మహేష్ బాబు సరసన కీర్తీ సురేష్ సర్కారువారీ పాటలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X