HBD Mahesh Babu: మహేశ్‌ ఆస్తి అన్ని వందల కోట్లా.. డబ్బు దాచుకోని రియల్ హీరో.. ఇండియాలోనే తొలి హీరో

బాల నటుడిగా సినిమాల్లోకి ఎంటరై.. చిన్న వయసులోనే తన సత్తాను నిరూపించుకున్నాడు మహేశ్ బాబు. అలాగే, 'రాజకుమారుడు' సినిమాతో హీరోగా మారి.. ఆరంభలో ఎన్నో సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో సూపర్ స్టార్‌గా ఎదిగిడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇలా ఎన్నో రకాలుగా సంపాదిస్తున్నా.. ఆ డబ్బును సమాజ సేవకు ఉపయోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలో మహేశ్ గురించి కొన్ని ఆసక్తికరమై విషయాలను తెలుసుకుందాం!

ఆ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా:సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆ మధ్య వరుసగా హ్యాట్రిక్ హిట్లను అందుకుని సత్తా చాటాడు. అయితే, గత చిత్రం 'సర్కారు వారి పాట' మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక ఇప్పుడు అతడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' మూవీని చేస్తున్నాడు. ఈ షూటింగ్ సగం వరకూ పూర్తైంది. దీని తర్వాత మహేశ్ బాబు.. రాజమౌళితోనూ ఓ సినిమాను చేయబోతున్నాడు.

HBD Mahesh Babu: Unknown Facts about Mahesh Babu Helps, Donations and Net Worth

కాంట్రవర్శీలకు చాలా దూరం:ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం మహేశ్ బాబుకు అలవాటు అన్న విషయం తెలిసిందే. అందుకే అతడి పనితీరు, వ్యవహార శైలిపై ఎప్పుడూ విమర్శలు రావు. అంతేకాదు, వివాదాలకు కూడా దూరంగా ఉండడంతో క్లీన్ పర్సన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అందరు హీరోలతోనూ స్నేహంగా ఉంటాడు. ఈ లక్షణాలే అతడి కెరీర్‌ సక్సెస్‌‌గా సాగడానికి దోహదం చేస్తున్నాయి.

HBD Mahesh Babu: Unknown Facts about Mahesh Babu Helps, Donations and Net Worth

మూవీలు, యాడ్స్, బిజినెస్‌లు:తెలుగులో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే మహేశ్ బాబు.. నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇందులో భాగంగానే తొలినాళ్ల నుంచే కమర్షియల్ సినిమాల్లోనే నటిస్తున్నాడు. అలాగే, వ్యాపార ప్రకటనలు చేస్తూ, నిర్మాతగా సినిమాలు తీస్తూ భారీగానే లాభాలను అర్జిస్తున్నాడు. వీటితో పాటు కొన్ని వ్యాపారాలను కూడా చేస్తున్నాడు.

దత్తత తీసుకున్న హీరో అతడే:సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాల పరంగానే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరోనే అనిపించుకుంటున్నాడు. ఆ మధ్య అతడు గుంటూరులోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. తర్వాత మహబూబ్‌నగర్‌లోని సిద్ధాపురం గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నాడు. ఆ రెండు ఊళ్ల వాళ్లకు ఏమాత్రం లోటు లేకుండా ఎన్నో అభివృద్థి పనులు చేయించాడు.

HBD Mahesh Babu: Unknown Facts about Mahesh Babu Helps, Donations and Net Worth

చిన్నారుల నవ్వుల్లోనూ మహేశ్:సుదీర్ఘమైన కెరీర్‌లో మహేశ్ బాబు చేసిన మంచి పనులు, ఇచ్చిన విరాళాలు ఎన్నో ఉన్నాయి. వీటికి మించి MBForSavingHearts పేరిట చిన్నారులకు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయిస్తున్నాడు. ఇప్పటి వరకూ సూపర్ స్టార్ వేయి మందికి పైగానే చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి వాళ్ల చిరునవ్వుకు ప్రతిరూపమైన ఏకైక హీరోగా రికార్డు సాధించాడు.

HBD Mahesh Babu: Unknown Facts about Mahesh Babu Helps, Donations and Net Worth

అన్ని కోట్లు నికర ఆదాయం:సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, నిర్మాతగా, బిజినెస్‌మ్యాన్‌గా ఫుల్లుగా సంపాదిస్తున్నాడు. ఇలా అతడి నికర ఆదాయం రూ. 300 కోట్లు వరకూ ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. అంతేకాదు, అతడు ఒక్కో సినిమాకు రూ. 50 - 70 కోట్లు వరకూ రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే, యాడ్స్ రూపంలోనూ ఏడాదికి పది కోట్లు వరకూ సంపాదిస్తున్నాడట.

HBD Mahesh Babu: Unknown Facts about Mahesh Babu Helps, Donations and Net Worth

ఆస్తులు భారీగా.. వాళ్ల కోసం:సూపర్ స్టార్ మహేశ్ బాబుకు హైదరాబాద్‌లో రూ. 40 కోట్లు విలువైన ఇల్లు ఉంది. అలాగే, బెంగళూరులోనూ ఓ విలాసవంతమైన ఇల్లు ఉన్నట్లు తెలిసింది. అలాగే, కార్లు ఇతర యాక్ససిరీస్‌ల విలువ రూ. 50 కోట్లు వరకూ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఎంత సంపాదన ఉన్నా మహేశ్ సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఇలా కెరీర్ పరంగా ఎన్నో విజయాలను అందుకుంటూ.. ప్రజాసేవలో ఎప్పుడూ ముందుండాలని కోరుకుంటూ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X