twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBD Chiranjeevi: చిరంజీవి ఆస్తులు, రెమ్యూనరేషన్ వివరాలివే.. ఏకైక ఇండియన్ హీరోగా రికార్డు

    |

    స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగిపోయిన హీరో మెగాస్టార్ చిరంజీవి. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి గ్రేస్, స్టైల్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఆయన.. ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను భారీగా ఏర్పరచుకున్నారు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నారు. మధ్యలో సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో సత్తా చాటుతోన్నారు. అలాగే, సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన రికార్డులు, రెమ్యూనరేషన్, ఆస్తుల గురించి తెలుసుకుందాం!

    చిరంజీవి కుటుంబ నేపథ్యం ఇదే

    చిరంజీవి కుటుంబ నేపథ్యం ఇదే

    మెగాస్టార్ చిరంజీవి 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు జన్మించారు. ఆయన 1980లో అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు. చిరంజీవికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అలాగే, ఆయనకు పవన్, నాగబాబుతో పాటు ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు.

    తల్లైన వెంటనే సోనమ్ కపూర్ షాకింగ్ పోస్ట్: అసలు ఇష్టం లేకుండానే అంటూ!తల్లైన వెంటనే సోనమ్ కపూర్ షాకింగ్ పోస్ట్: అసలు ఇష్టం లేకుండానే అంటూ!

    అలా ఎంటర్.. ఆ మూవీతో స్టార్‌గా

    అలా ఎంటర్.. ఆ మూవీతో స్టార్‌గా

    మెగాస్టార్ చిరంజీవి 1978లో ‘పునాదిరాళ్లు' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే, 1983లో వచ్చిన ‘ఖైదీ' అనే సినిమా.. చిరంజీవిని కెరీర్‌ను మార్చేసింది. ఇందులో ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అలాగే, ఈ చిత్రంతోనే ఆయన స్టార్‌గా ఎదిగిపోయారు.

    చిరు కెరీర్‌ మార్చేసిన మూవీలివే

    చిరు కెరీర్‌ మార్చేసిన మూవీలివే

    ‘ఖైదీ' తర్వాత చిరంజీవికి ఎన్నో హిట్లు వచ్చాయి. వాటిలో ‘చంటబ్బాయ్‌', ‘ఛాలెంజ్‌', ‘అభిలాష', ‘శుభలేఖ', ‘గ్యాంగ్‌ లీడర్‌', ‘రౌడీ అల్లుడు', ‘ఘరానా మొగుడు', ‘స్వయం కృషి', ‘రుద్రవీణ', ‘యముడికి మొగుడు', ‘అత్తకు యముడు.. అమ్మాయికి మొగుడు', ‘జగదేక వీరుడు అతిలోక సుందరి', ‘ఇంద్ర', ‘ఠాగూర్‌' పేరు తెచ్చాయి.

    ఈషా రెబ్బ పరువాల జాతర: అబ్బా.. ఆమెనిలా చూస్తే మెంటలేఈషా రెబ్బ పరువాల జాతర: అబ్బా.. ఆమెనిలా చూస్తే మెంటలే

    రాజకీయాల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్

    రాజకీయాల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్

    స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి 2008 ఆగస్టులో ‘ప్రజా రాజ్యం' పార్టీని స్థాపించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, 2011 ఫిబ్రవరిలో ‘ప్రజా రాజ్యం' పార్టీని ‘కాంగ్రెస్‌'లో వీలీనం చేశారు. ఆ తర్వాత 2012 మార్చిలో రాజ్యసభకు ఎన్నికై కేంద్ర పర్యాటకశాఖా మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు.

    సినిమాల్లోకి రీఎంట్రీ.. ఫుల్ స్పీడ్

    సినిమాల్లోకి రీఎంట్రీ.. ఫుల్ స్పీడ్

    రాజకీయాల కోసం సినిమాలకు దూరమైన మెగాస్టార్ చిరంజీవి.. ‘ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చారు. ఇది మంచిగా ఆడడంతో ఆయన రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాను చేశారు. దీని తర్వాత అంటే ఇటీవలే ‘ఆచార్య' అనే మూవీని చేశారు. కానీ, ఇది ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

    బిగ్ బాస్ దివి అరాచకం: అసలైన అందాలను చూపిస్తూ హాట్ షోబిగ్ బాస్ దివి అరాచకం: అసలైన అందాలను చూపిస్తూ హాట్ షో

    ఏకంగా మూడు సినిమాలతో బిజీ

    ఏకంగా మూడు సినిమాలతో బిజీ

    మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజాతో ‘గాడ్ ఫాదర్' అనే సినిమాను చేస్తున్నారు. ఈ షూటింగ్ దాదాపుగా పూర్తైంది. దీనితో పాటు మెహర్ రమేష్‌తో ‘భోళా శంకర్' అనే మూవీ కూడా చేస్తున్నారు. ఇది కూడా చాలా వరకు షూట్ కంప్లీట్ చేసుకుంది. అలాగే, బాబీతో ‘వాల్తేరు వీరయ్య' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నాడు.

    చిరుకు ఎన్నో ఉత్తమ గౌరవాలు

    చిరుకు ఎన్నో ఉత్తమ గౌరవాలు

    చిరంజీవిని 2006లో పద్మభూషణ్‌ పురస్కారంతో ఆయనను సత్కరించింది. 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటును అందుకున్నారు. వీటితో పాటు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు, నంది, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు ఆయనను వరించాయి. అలాగే, ఈ సినీ ప్రయాణంలో చిరంజీవి ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుని దేశంలోనే టాప్ హీరోగా వెలుగొందుతున్నారు.

    శృతి మించిన రాశీ ఖన్నా అందాల ఆరబోత: అసలు ఆమె టాప్ చూశారంటే!శృతి మించిన రాశీ ఖన్నా అందాల ఆరబోత: అసలు ఆమె టాప్ చూశారంటే!

    సేవలతో ప్రాణదాత అనిపించేలా

    సేవలతో ప్రాణదాత అనిపించేలా


    చిరంజీవి అప్పట్లో బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఐ (కంటి) బ్యాంక్‌ను కూడా స్థాపించారు. వీటి ద్వారా ఎంతో మందికి ప్రాణాన్ని, చూపును అందించి ప్రాణదాతగా మారారు. అలాగే, కష్ట సమయంలో విరాళాలు ఇచ్చి అండగా నిలబడ్డారు. కరోనా సమయంలో సినీ పరిశ్రమకు పెద్ద దిక్కయ్యారు. ఇక, ఇప్పుడు సినీ కార్మికుల కోసం ఏకంగా ఆస్పత్రినే కట్టిస్తానని హామీ ఇచ్చారు.

    ఇండియాలో ఏకైక హీరోగా రికార్డ్

    ఇండియాలో ఏకైక హీరోగా రికార్డ్

    మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సినిమాల్లో మాస్ డ్యాన్స్‌తో మెప్పించారు. ఈ క్రమంలోనే ‘పసివాడి ప్రాణం' చిత్రం ద్వారా తెలుగు తెరకే కాదు.. ఇండియా మొత్తానికే తొలిసారి ‘బ్రేక్‌ డ్యాన్స్‌'ను పరిచయం చేశారు. అలాగే, ఎన్నో సినిమాల్లో అద్భుతమైన కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేశారు. అలాగే, ఎక్కువ కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాలు కూడా చిరంజీవివే ఎక్కువున్నాయి.

    హాట్ షోలో హద్దు దాటిన బిగ్ బాస్ లహరి: స్లీవ్‌లెస్ టాప్‌లో అందాల ఆరబోతహాట్ షోలో హద్దు దాటిన బిగ్ బాస్ లహరి: స్లీవ్‌లెస్ టాప్‌లో అందాల ఆరబోత

    చిరు ఆస్తులు, రెమ్యూనరేషన్ ఇలా

    చిరు ఆస్తులు, రెమ్యూనరేషన్ ఇలా

    మెగాస్టార్ చిరంజీవికి దాదాపు రూ. 1800 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఓ టాక్ ఉంది. అలాగే, దాదాపు 100 కోట్ల విలువున్న ప్రాపర్టీలు కూడా ఉన్నాయట. అలాగే, కార్లు, ఇల్లు మిగతా యాక్ససిరీస్‌ల విలువ 200 - 300 కోట్లు ఉంటుందట. అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 30 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

    ఇలా ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తూ.. ప్రజాసేవలోనూ ముందుంటూ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఫిల్మీబీట్ తరపున మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

    English summary
    Tollywood Senior Hero Megastar Chiranjeevi Birthday Today. On The Occasion of His Birthday.. Let we Know his Net Worth and Remuneration.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X