twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBD Nagarjuna: నాగార్జునకు అన్ని కోట్ల ఆస్తులు.. రెమ్యూనరేషన్ ఇలా.. ప్రపంచంలో ఏకైక హీరోగా రికార్డు

    |

    అక్కినేని నాగేశ్వర్రావు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ టైంలోనే తన టాలెంట్లను చూపించుకుని టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిపోయారు కింగ్ అక్కినేని నాగార్జున. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఆయన.. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇక, లవర్ బాయ్‌గా, మన్మథుడిగా, భక్తుడిగా, దేవుడిగా కనిపించినా అది నాగార్జునకు మాత్రమే సాధ్యమైంది. యంగ్ ఏజ్ నుంచి ఆరుపదుల వయసులోనూ తన సత్తాను చూపిస్తూనే ఉన్నారు. అక్కినేని నాగార్జున నేడు పుట్టినరోజును జరుపుకుంటోన్నారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులు, రెమ్యూనరేషన్, ఆస్తుల గురించి తెలుసుకుందాం!

    చైల్డ్ ఆర్టిస్టుగా.. హీరోగా మారిన నాగ్

    చైల్డ్ ఆర్టిస్టుగా.. హీరోగా మారిన నాగ్

    రెండేళ్ల వయసులోనే 'వెలుగు నీడలు' అనే సినిమాలో కనిపించి.. ఆ తర్వాత 'సుడిగుండాలు' అనే చిత్రానికి నాగార్జున చైల్డ్ ఆర్టిస్టుగా చేశారు. ఈ క్రమంలోనే 1986లో 'విక్రమ్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని నాగార్జున.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగారు. దీంతో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ ఉన్నారు.

    హాట్ షోలో హద్దు దాటిన దివి: ఏకంగా స్నానం చేస్తోన్న పిక్ వదలడంతో!హాట్ షోలో హద్దు దాటిన దివి: ఏకంగా స్నానం చేస్తోన్న పిక్ వదలడంతో!

    సినీ పరిశ్రమలో ట్రెండ్ సెట్ చేస్తూ

    సినీ పరిశ్రమలో ట్రెండ్ సెట్ చేస్తూ


    కెరీర్ ఆరంభం నుంచే నాగార్జున వరుస పెట్టి సినిమాలు చేయడంతో పాటు విజయాలను కూడా అందుకున్నా.. అక్కినేని అభిమానులు సంతృప్తి చెందలేదు. ఇలాంటి సమయంలోనే వచ్చింది 'శివ'. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతేకాదు, అప్పటి వరకూ టాలీవుడ్‌లో పెట్టుకున్న బౌండరీలను సరిచేసి ఇండస్ట్రీలో ట్రెండ్‌ సెట్ చేసింది.

    వైవిధ్యమైన పాత్రలతో ప్రయోగాలు

    వైవిధ్యమైన పాత్రలతో ప్రయోగాలు

    సుదీర్ఘమైన కెరీర్‌లో అక్కినేని నాగార్జున ఎన్నో రకాల చిత్రాల్లో, చాలా వైవిధ్యమైన పాత్రలు చేశారు. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లోనే నటించిన ఆయన.. ఆ తర్వాత పంథాను మార్చుకుని ప్రయోగాలు చేస్తూ వచ్చారు. లవర్ బాయ్‌గా నటించిన ఈ స్టార్ హీరోనే సాయి బాబాలా కూడా మెప్పించారు. తద్వారా తన యాక్టింగ్ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటారు.

    పాయల్‌ను ఏమీ లేకుండా చూపించమన్న నెటిజన్: ఆ ఫొటో షేర్ చేయడంతో షాక్పాయల్‌ను ఏమీ లేకుండా చూపించమన్న నెటిజన్: ఆ ఫొటో షేర్ చేయడంతో షాక్

    నిర్మాతగానూ సత్తా.. జాతీయ అవార్డ్

    నిర్మాతగానూ సత్తా.. జాతీయ అవార్డ్

    1979లోనే 'కల్యాణీ' అనే మూవీతో నాగార్జు నిర్మాతగా మారారు. అప్పటి నుంచి ఎన్నో చిత్రాలను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై స్వయంగా నిర్మించారు. అందులో తన సినిమాలతో పాటు తండ్రి ఏఎన్నార్ చిత్రాలు, ఇతర హీరోలు చేసిన మూవీలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే 'నిన్నే పెళ్లాడతా' చిత్రానికి నేషనల్ అవార్డు తీసుకున్నారు. ఇప్పటికీ నిర్మాతగా చేస్తున్నారు.

    బుల్లితెరపైనా సత్తా.. రికార్డులతోనే

    బుల్లితెరపైనా సత్తా.. రికార్డులతోనే

    సినీ రంగంలో సత్తా చాటిన నాగార్జున.. కొన్నేళ్ల క్రితం బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే షోతో ఆయన హోస్టుగా పరిచయం అయిన ఆయన.. అందులో అదరగొట్టేశారు. ఆ తర్వాత అదే ఛానెల్‌లో వచ్చిన బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'ను కూడా హోస్ట్ చేశారు. దీనితో నాగార్జున ఏకంగా జాతీయ స్థాయిలో రికార్డులను నమోదు చేసుకున్నారు.

    Bigg Boss 6: సీజన్ ముందు బిగ్ బాస్‌కు షాక్.. చివరి నిమిషంలో ఇద్దరు బిగ్ స్టార్స్ ఔట్Bigg Boss 6: సీజన్ ముందు బిగ్ బాస్‌కు షాక్.. చివరి నిమిషంలో ఇద్దరు బిగ్ స్టార్స్ ఔట్

    చాలా వ్యాపారాలు... నేషనల్ రేంజ్

    చాలా వ్యాపారాలు... నేషనల్ రేంజ్

    కింగ్ నాగార్జున కేవలం సినిమాలకే పరిమితం అవలేదు. ఆ మధ్య ఓ ఛానెల్‌కు సహా భాగస్వామిగా ఉన్న ఆయన.. ఆ తర్వాత ఎన్నో వ్యాపారాలను మొదలు పెట్టారు. ఇందులో బాడ్మింటన్ లీగ్, ఫుల్‌బాల్ లీగ్‌లలో ఒక్కో జట్టుకు ఓనర్‌గా కూడా వ్యవహరించారు. ఇలా ఆయన దేశ వ్యాప్తంగా తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటూ పక్కా బిజినెస్‌మ్యాన్ అనిపించుకునేలా మారిపోయారు.

    ప్రపంచంలోనే ఏకైక హీరోగా రికార్డ్

    ప్రపంచంలోనే ఏకైక హీరోగా రికార్డ్


    నాగార్జున ఎన్నో మర్చిపోలేని చిత్రాలను చేశారు. వాటి ద్వారా ఆయన ఎన్నో రికార్డులు, అవార్డులు కూడా అందుకున్నారు. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం 'మనం' అనే చిత్రంలో నటించారు. ఇందులో నాగార్జునతో పాటు ఏఎన్నార్, నాగ చైతన్య, సమంత, అమల, అఖిల్ కనిపించారు. ఇలా ఫ్యామిలీ మొత్తంతో సినిమా చేసిన ప్రపంచంలోనే ఏకైక హీరోగా ఆయన రికార్డు సాధించారు.

    బట్టలు లేకుండా స్టార్ హీరోయిన్: డెలివరీ అయిన వెంటనే ఘోరంగా!బట్టలు లేకుండా స్టార్ హీరోయిన్: డెలివరీ అయిన వెంటనే ఘోరంగా!

    నాగ్ ఆస్తులు, రెమ్యూనరేషన్ ఇలా

    నాగ్ ఆస్తులు, రెమ్యూనరేషన్ ఇలా

    నాగార్జునకు దాదాపు రూ. 1200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఓ టాక్ ఉంది. అలాగే, దాదాపు 100 కోట్ల విలువున్న ప్రాపర్టీలు కూడా చాలా ఉన్నాయట. అలాగే, కార్లు, ఇల్లు మిగతా యాక్ససిరీస్‌ల విలువ 200 - 300 కోట్లు ఉంటుందట. అంతేకాదు, నాగార్జున ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. వీటితో పాటు పలు ఆదాయ మార్గాల ద్వారా ఎన్నో కోట్లు సంపాదిస్తున్నారని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. ఇక, ఇప్పుడు నాగార్జున 'ఘోస్ట్' అనే సినిమా చేస్తున్నారు. ఇది అక్టోబర్ 5న విడుదల కాబోతుంది.

    నటుడిగా, నిర్మాతగా, హోస్టుగా చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న నవ మన్మథుడు అక్కినేని నాగార్జునకు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

    English summary
    Tollywood Senior Hero Nagarjuna Akkineni Birthday Today. On The Occasion of His Birthday.. Let we Know his Net Worth and Remuneration.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X