తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే.. ఆశయం ఎల్లప్పుడూ జనహితమే.. పవన్‌కు చిరు విషెస్

పవర్ స్టార్ బర్త్ డే అంటూ సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. పవన్ కళ్యాణ్ బర్త్ డే రాబోతోందని గత రెండు నెలలుగా సోషల్ మీడియాలో సెలెబ్రేషన్స్ జరుగుతూనే వచ్చాయి. అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్, కామన్ డీపీ ట్రెండ్ అంటూ ఇలా సోషల్ మీడియాలో అంతా రచ్చ చేశారు ఫ్యాన్స్. ఇక నేడు ఆ తరుణం రానే వచ్చింది. నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖులంతా విషెస్ తెలుపుతున్నారు.

వెల్లువెత్తిన విషెస్..

వెల్లువెత్తిన విషెస్..

పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో మొత్తం పవర్ స్టార్ నామమే జపిస్తోంది. టాలీవుడ్ హీరో, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు ఇలా ప్రతీ ఒక్కరూ పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్‌తో తమ కున్న అనుబంధాన్ని తెలియజేస్తూ.. సెలెబ్రిటీలు ఇప్పటికే ఎంతో మంది ట్వీట్లు చేశారు.

గొప్ప మానవత్వ ఉన్న మనిషి..

గొప్ప మానవత్వ ఉన్న మనిషి..

గోపాల గోపాల చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన వెంకటేష్ నేడు ప్రత్యేకంగా విషెస్ తెలిపాడు. ఓ గొప్ప మానవత్వం ఉన్న హ్యూమన్ బీయింగ్.. నా ప్రియ మిత్రుడు పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీకు ఆయురారోగ్యాలు చేకూరాలి అంటూ వెంకటేష్ ట్వీట్ చేశాడు.

అరుదైన ఫోటోలు..

అరుదైన ఫోటోలు..

సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలా ఎంతో మంది హీరోలు కొన్ని అరుదైన ఫోటోలను షేర్ చేశారు. పవన్ కళ్యాణ్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక తాజాగా చిరంజీవి తన తమ్ముడిపై ఉన్న ప్రేమకు అక్షర రూపాన్ని ఇచ్చాడు. చిరు చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే

తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే

‘తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే.. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే.. తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే.. తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ తమ్ముడిపై ఉన్న ఆకాశమంత ప్రేమను ఇలా అక్షరరూపంలో తెలిపాడు. ఇక శంకర్ దాదా జిందాబాద్ షూటింగ్ సమయంలో దిగిన ఫోటోను షేర్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు.

Recommended Video

Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
ఘటనపై దిగ్భ్రాంతి..

ఘటనపై దిగ్భ్రాంతి..

‘చిత్తూర్ లో పవన్ బర్త్ డేకి బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించటం గుండెను కలిచివేసింది. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వo..'అంటూ చిరు దిగ్భ్రాంతికి లోనయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X