twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBDPawanKalyan..బన్నీ ఇలా, సాయి ధరమ్ తేజ్ అలా.. స్పెషల్ పిక్‌తో మహేష్ బాబు విషెస్

    |

    పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటే సోషల్ మీడియాలో సునామీ మొదలవ్వాల్సిందే. పవర్ స్టార్‌కు తన ఫ్యాన్స్‌తో టాలీవుడ్ మొత్తం విషెస్ చెబుతుంది. సెలెబ్రిటీల ట్వీట్లతో ట్విట్టర్ మొత్తం షేక్ అవుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బర్త్ డే నేషనల్ వైడ్‌గా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక తాజాగా బన్నీ, సాయి ధరమ్ తేజ్, మహేష్ బాబు విషెస్ చెబుతూ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

    అరుదైన ఫోటోతో..

    అరుదైన ఫోటోతో..

    అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌ల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని అభిమానులు భావిస్తుంటారు. ఈ ఇద్దరి అభిమానుల మధ్య కూడా చిన్న పాటి ఘర్షణ జరుగుతూ ఉంటుంది. కానీ నేడు బన్నీ విష్ చేసిన విధానం.. షేర్ చేసిన ఫోటోకు పవన్ ఫ్యాన్స్ సంబరపడిపోయారు. గంగోత్రి, జానీ సినిమా టైంలో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

    సాయి ధరమ్ వెరైటీ విషెస్..

    సాయి ధరమ్ వెరైటీ విషెస్..


    సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ మధ్య ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ దగ్గరే పెరగడం, సినిమాలోకి వచ్చే ముందు పవన్ ఎన్నో విషయాలు నేర్పించిన సంగతి తెలిసిందే. తనకు, పవన్ కళ్యాణ్‌కు ఉన్న రిలేషన్‌ను తెలిసేలా చిన్నప్పుడు దిగిన ఫోటోను షేర్ చేశాడు. బుల్లి తేజును తన కాళ్ల మధ్యలో బంధించిన పవన్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేస్తూ అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ.. అలాగే ఉంటానని చెప్పనకనే చెప్పాడు.

    కచ్చితంగా మార్పు వస్తుంది..

    కచ్చితంగా మార్పు వస్తుంది..

    టాలీవుడ్‌లో రేసుగుర్రాల్ల పోటీ పడే ఇద్దరు హీరోల్లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఉంటారు. వీరిద్దరి మధ్య ఎప్పడూ నెంబర్ గేమ్ జరుగుతూనే ఉంటుంది. అలాంటి మహేష్ బాబు పవర్ స్టార్‌కు స్పెషల్‌గా విష్ చేశాడు. పవన్ కళ్యాణ్‌కు హ్యాపీ బర్త్ డే. మీ దయాగుణం, మానవత్వం కచ్చితంగా ఓ మార్పును తీసుకువస్తుంది.. మీకు ఆయురారోగ్యాలు చేకూరాలి అంటూ కోరుకున్నాడు.

    Recommended Video

    Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
    రవితేజ అలా..

    రవితేజ అలా..

    రవితేజ ఇక అరుదైన ఫోటోను షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ బర్త్ డేకు విషెస్ తెలిపాడు. నాకు ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నిజమైన జెంటిల్‌మెన్‌కు ప్రతిరూపం.. ఓ మంచి స్నేహితుడు.. అంటూ రవితేజ్ ఎమోషనల్ అయ్యాడు.

    English summary
    HBD Pawan Kalyan Mahesh Babu Allu ARjun And Sai Dharam Tej Shares Special Pics
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X