HBDPawanKalyan.. నీ రాకతో ఇంట్లోకి సంతోషాన్ని తెచ్చావ్.. నాగబాబు స్పెషల్ విషెస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా సోషల్ మీడియాలో సునామీ ఏర్పడింది. నేటి ఉదయం నుంచి సెలెబ్రిటీల విషెస్‌తో ట్విట్టర్ మొత్తం షేక్ అవుతోంది. ఇక ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. వారు నిన్న సాయంత్రం నుంచే బర్త్ డేను ట్రెండ్ చేసే పనిలో పడ్డారు. ఇక మెగా హీరోలు పవన్ కళ్యాణ్‌కు అత్యంత గొప్పగా, విశిష్టంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
పవన్ కళ్యాణ్‌తో ఉన్న అనుబంధం తెలియజేసేలా పాత ఫోటోలను షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ క్రమంలో నాగబాబు తన తమ్ముడితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ..'నువ్ పుట్టినప్పటి క్షణాలు ఇంకా గుర్తున్నాయి.. వస్తూనే మన ఇంట్లోకి సంతోషాన్ని తెచ్చావ్.. అలాగే ఇప్పుడు నీ పుట్టిన రోజుతో లక్షల మంది ఇంట్లో సంతోషాన్ని తీసుకొచ్చావ్.. ఎంతో ఆనందంగా ఉంది.. హ్యాపీ బర్త్ డే తమ్ముడు.. ' అంటూ ఎమోషనల్ అయ్యాడు.

ఇక రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ఆర్ట్‌ను షేర్ చేస్తూ.. 'నా జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్. ఎంతో కచ్చితంగా వ్యవహరిస్తుంటారు. అతని మాటలు నాలో స్ఫూర్తిని నింపుతాయి. ప్రోత్సహిస్తాయి. మోటివేట్ చేస్తాయి..నన్ను నేను గొప్పగా మలుచుకునేందుకు తోడ్పడుతాయి. నా బాబాయ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ ప్రేమను కురిపించాడు. మొత్తానికి మెగా హీరోలంతా పవన్‌పై ఉన్న ప్రేమను విభిన్నంగా చాటుకున్నారు.


Click it and Unblock the Notifications











