నా గోడపై ఉండే ఏకైక పోస్టర్ అదే.. ప్రశాంత్ వర్మ స్పెషల్ విషెస్
పవన్ కళ్యాణ్ యూత్ ఐకాన్. ఆయన హెయిర్ స్టైల్, నడక, భాష, యాస, యాటిట్యూడ్ అన్నీ కూడా యూత్‌కు పిచ్చెక్కించేవి. గుడుంబా శంకర్ డబుల్ ప్యాంట్స్ అయినా బాలు సినిమాలోని స్పెషల్ డిజైనర్ ప్యాంట్ అయినా, ఖుషీ బ్యాగ్ అయినా ఇలా చెప్పుకుంటే పోతే కోకోల్లలు. పవన్ కళ్యాణ్‌ను ఫాలో కానీ యూత్ ఎవ్వరూ ఉండేవారు కారంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో పవన్ కళ్యాణ్ ట్రెండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
అయితే పవన్ కళ్యాణ్ పోస్టర్లకు ఉండే క్రేజ్ గురించి ఈ యువ దర్శకుడు చేసిన ట్వీటే నిదర్శనం. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ వర్మ విషెస్ చెబుతూ నాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. బాలు సినిమాలోని వెరైటీ ప్యాంట్ ధరించి తాజ్ మహల్ వెనకాల నిల్చుని ఉండే పోస్టర్.. తన గోడలపై ఉండే ఏకైక పోస్టర్ అని చెప్పుకొచ్చాడు. ఆ ప్యాంట్ ఎంత మంది కొని ఉన్నారు? అంటూ ప్రశ్నను సంధించాడు.

ఇక పవన్ బర్త్ డే సందర్భంగా నారా రోహిత్, ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆరోగ్యం, విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని కోరుకుంటున్నాను అని నారా రోహిత్ ట్వీట్ చేశాడు. మీరు చేసే పనులు, మీ నిరాడంబరతను చూసి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. మీకు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను సర్.. వకీల్ సాబ్‌గా చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా అంటూ రాహుల్ విజయ్.. పవన్ కళ్యాణ్‌తో చిన్నప్పుడు దిగిన ఫోటోను షేర్ చేశాడు.


Click it and Unblock the Notifications











