PSPK27 update.. అదిరిపోయిన గిఫ్ట్.. పవన్‌ను కొత్తగా చూపించబోతోన్న క్రిష్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు నేడు ఊపిరిసలపనతం గ్యాప్ కూడా ఇవ్వడం లేదు. నేటి ఈ బర్త్ డేను ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా అందరూ కలిసి అదిరిపోయే స్కెచ్ వేశారు. ఒకదాని వెంట మరొకటి అప్డేట్స్ ఇస్తున్నారు. ఉదయాన్నే వకీల్ సాబ్ మోషన్ పోస్టర్‌తో కడుపు నింపిన దర్శక నిర్మాతలు.. మధ్యాహ్నానికి మరో ఫుల్ మీల్స్ రెడీ చేశారు. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో, ఎస్‌జే సూర్య నిర్మాణంలో రాబోతోన్న ప్రాజెక్ట్ అప్డేట్‌ను ఇచ్చారు.

సోషల్ మీడియాలో రచ్చ..
అసలే పవన్ కళ్యాణ్ బర్త్ డేకు ముందే సోషల్ మీడియా రికార్డులను బద్దలు కొట్టేశారు ఫ్యాన్స్. 65 మిలియన్ల ట్వీట్లతో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక నేటి బర్త్ డే హ్యాష్ ట్యాగ్‌ను దేశ వ్యాప్తంగా ట్రెండ్ చేస్తున్నారు. వీటితో పాటు సెలెబ్రిటీల విషెస్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి.

ట్రెండింగ్‌లో వకీల్ సాబ్..
పింక్ రీమేక్‌గా తెరకెక్కుతోన్న వకీల్ సాబ్ చిత్రం అప్డేట్ నేడు వచ్చింది. వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ నేటి ఉదయం విడుదల కాగా.. అది జాతీయ స్థాయిలో వైరల్ అవుతోంది. సత్యమేవ జయతే అంటూ తమన్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

తాజాగా క్రిష్ ప్రాజెక్ట్..
విభిన్న చిత్రాలను తెరకెక్కించే క్రిష్.. పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేయబోతోన్న సంగతి తెలిసిందే. చారిత్రాక నేపథ్యంతో కూడుకున్న ఈ సినిమాలో పవన్ భిన్న పాత్రను పోషించబోతోన్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఈపాటికి జరిగి ఉండేది. కానీ కరోనా అడ్డు రావడంతో ఇంత వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. అందుకే నేడు ఓ స్పెషల్ అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఖుషీ చేయాలని చిత్రయూనిట్ భావించింది.
Recommended Video

అదిరిపోయిన లుక్..
పదిహేన్రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది.. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది.. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం..ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ అంటూ అదిరిపోయే పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీకి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











