PSPK28 update.. ‘గబ్బర్ సింగ్’ను మించేలా.. రచ్చ చేసేందుకు హరీష్ శంకర్ రెడీ

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు నేడు నిద్ర పట్టకపోవచ్చు. ఒకదాని వెంట మరొకటి.. అప్డేట్స్ మీద అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఓ వైపు తమ దేవుడి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటే.. మరోవైపు వరుసగా సినిమాల అప్డేట్స్ వస్తుండటం ఆనందాన్ని వంద రెట్లు చేసినట్టు అవుతోంది. ఇప్పటికే వకీల్ సాబ్ మోషన్ పోస్టర్, క్రిష్ ప్రాజెక్ట్ ప్రీ లుక్ రావడంతో ఫ్యాన్స్ గాల్లో తేలిపోతున్నారు.

సందడిగా ఫ్యాన్స్..

సందడిగా ఫ్యాన్స్..

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇలాంటి బర్త్ డే, ఇటువంటి సర్ ప్రైజ్ గిఫ్ట్‌లు మరేతర హీరో కూడా ఇవ్వకపోవచ్చు. ఏకంగా నాలుగు సినిమాల అప్డేట్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ దుమ్ములేపుతుండగా.. క్రిష్ రిలీజ్ చేసిన ప్రీలుక్ అంచనాలు పెంచేశాయి.

సోషల్ మీడియాలో రచ్చ..

సోషల్ మీడియాలో రచ్చ..

ఇక ఇటువంటి అప్డేట్స్‌తో ఫ్యాన్స్ సంబరాలు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక బర్త్ డే విషయాన్ని HBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్‌తో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. ఓ వైపు జనసైనికులు మృతి చెందినా సరే ఈ యుద్దాన్ని మాత్రం ఆపడం లేదు. ఇక తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతోన్న PSPK28 అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 హరీష్, మైత్రీ కాంబోలో..

హరీష్, మైత్రీ కాంబోలో..

గబ్బర్ సింగ్ కాంబోలో ఓ చిత్రం కావాలని ఎప్పటి నుంచో పవన్ ఫ్యాన్స్ కోరుతున్నారు. మొత్తానికి ఆ దేవుడు కరుణించాడు. ఆ ప్రాజెక్ట్ సెట్ అయింది. తాజాగా వదిలిన అప్డేట్‌తో ఫ్యాన్స్ హ్యాపీ అయ్యారు. ఈసారి కేవలం ఎంటర్టైన్మెంటే కాదు అంతకు మించి అంటూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఆ బైక్ వెనకలా దేశభక్తిని చాటేలా నేతాజీ, సర్దార్ జీ ఫోటోలతో రిలీజ్ చేసిన పోస్టర్ దుమ్ములేపుతోంది . ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.

Recommended Video

Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
సాయం చేసేందుకు వచ్చిన మైత్రీ..

సాయం చేసేందుకు వచ్చిన మైత్రీ..

పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు కడుతూ కుప్పంలో ముగ్గురు అభిమానులు మరణించిన సంగతి తెలిసిందే. వీరి కుటుంబాలకు అండగా మైత్రీ సంస్థ నిలబడింది. ప్రతీ ఒక్కరి కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయం చేస్తామని మైత్రీ సంస్థ ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X