For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBD Ram Charan.. బన్నీ అలా నాగబాబు ఇలా.. మెగా విషెస్ వైరల్

    |

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే నేడు (మార్చి 27).ఈ క్రమంలో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీకి చెందిన హీరో, చెర్రీ సోదరమణులు స్పెషల్ విషెస్ అందించారు. ఇందులో నాగబాబు చేసిన కామెంట్లు, చెప్పిన విషెస్ అందరి కంటే భిన్నంగా ఉన్నాయి. ఇక బన్నీ, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక, అల్లు శిరీష్ చేసిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.

    బన్నీ అలా..

    చెర్రీ బన్నీలు ఎంత క్లోజ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మధ్య మధ్యలో అల్లు కాంపౌండ్ మెగా కాంపౌండ్ వేరు పడ్డాయంటూ గుసగుసలు వినిపిస్తుంటాయి. కానీ ఇలాంటి సందర్భాల్లో అల్లు మెగా బంధం బయటపడుతుంది. మై స్వీటెస్ట్ బ్రదర్ అంటూ చెర్రీకి బన్నీ విషెస్ అందించాడు.

    బికినీ అందాలు.. ఔరా అనిపిస్తోన్న నైరా బెనర్జీ

    నాగబాబు ఇలా..

    ఇక నాగబాబు మాత్రం రామ్ చరణ్‌ను ఆకాశానికెత్తేశాడు. చిరంజీవి రాముడిలా మా కుటుంబాన్ని కాపాడుతూ వచ్చాడు.. ఆయన మాటతో మా అందరినీ ఏకీకృతం చేసి ఉంచాడు.. అలాగే రామ్ చరణ్ మా ముందు తరాలను అలానే ఉంచుతున్నాడు.. మా మెగా ఫ్యామిలీ భవిష్యత్తుకు టార్చ్ బేరర్ అంటూ విషెస్ చెప్పేశాడు.

    వరుణ్ తేజ్ విషెస్..

    హ్యాపీ బర్త్ డే అన్నా.. నీ మీదున్న ప్రేమను, గౌరవాన్ని మాటల్లో చెప్పలేను.. పదాలుగా రాయలేను.. మేరా యార్ మేరా భాయ్ అంటూ చెర్రీతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ వరుణ్ తేజ్ స్పెషల్ విషెస్ అందించాడు.

    సాయి ధరమ్ తేజ్ ట్వీట్..

    హ్యాపీ బర్త్ డే చరణ్.. నువ్ చేసే ప్రతీ పనిలో ఎంత ప్రాణం పెట్టి చేస్తావో చూసిన, తెలిసిన అతి కొద్ది మందిలో నేను ఒకడినీ.. అదే నన్ను ఆశ్చర్యపరుస్తుంటుంది..నీకు లైఫ్‌లో వచ్చే ప్రతీ విజయం అర్హమైందే.. లవ్యూ సో మచ్ అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ వేశాడు.

    సోదరీమణులు అలా..

    సోదరీమణులు అలా..

    ఇక రామ్ చరణ్‌పై తన సోదరీమణులైన నిహారిక, సుష్మిత, శ్రీజ ఎమోషనల్ పోస్ట్‌లు వేశారు. బాపూజీ అంటూ రామ్ చరణ్‌కు విషెస్ అందించింది నిహారిక. ఇక శ్రీజ, సుష్మితలు కూడా చెర్రీతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ విషెస్ అందించారు.

    English summary
    HBD Ram Charan Allu Arjun Naga babu varun tej Wishes Goes viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X